డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఇండియా ‘పబ్ జి' !

Update: 2020-11-26 23:30 GMT
ప‌బ్ ‌జీ గేమ్ మ‌ళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఈ గేమ్ ల‌వ‌ర్స్ ‌కు గుడ్ న్యూస్‌. డిసెంబర్ మొదటివారం లో పబ్ జి ఇండియా వర్షన్ విడుదల కాబోతుంది. చైనాతో జరిగిన వివాదంతో భారత ప్రభుత్వం భద్రత కారణాల రీత్యా గతంలో 118 యాప్స్ ని నిషేదించింది. ఆ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పబ్ జి కూడా ఒకటి. ఈ పబ్ జి గేమ్ ని భారత్ లో నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగానే పడింది. అయితే , తిరిగి పబ్ జి ఇండియా లోకి రావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికోసం స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది.

కొద్దీ రోజుల క్రితం భారత వినియోగదారుల కోసం పబ్ జి మొబైల్ ఇండియా పేరుతొ కొత్త యాప్ ని కూడా తీసుకువచ్చింది. ఇప్పటికే దీనికి సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసింది. పబ్‌ జీ మొబైల్ గేమ్ ‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్ ‌జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. భారత్ లో పబ్ జీ గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్ జీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పబ్ జీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణ తొందరలోనే ముగియనుంది. భారతదేశంలో ఈ గేమ్ ని అధికారికంగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పబ్ జి మొబైల్ ఇండియా పేరుతో రిజిస్టర్ చేయబడిన పబ్ జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో కంపెనీకి ఆటంకాలు అన్ని తొలిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం పబ్ జి మొబైల్ ఇండియాను డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయడానికి కంపెనీ సిద్ధం అవుతుంది.
Tags:    

Similar News