మోడీ అంటే అగ్రరాజ్యం అమెరికా మంచి మోజులో ఉందని ఇండియాలో విపక్షాలు కుళ్లుకుంటున్నాయి.. అయితే.. అమెరికా మోడీ విషయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు అలా కుళ్లుకుంటున్న విపక్షాలు సంబరపడేలా చేశాయి. అవును.. ఇన్ని రోజులూ మోడీనికి భుజానికెత్తుకున్న అమెరికా ఒక్కసారిగా మాట మార్చింది. మోదీ సంస్కరణల ఫలితం సున్నా అని తేల్చేసింది. అంతేకాదు.. వృద్ధి రేటు విషయంలో భారత్ చెబుతున్న లెక్కలన్నీ కల్లబొల్లి మాటలేనని ఆరోపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలతో మోడీ వ్యతిరేకులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయిందట.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల తాజాగా చేసిన "2016 పెట్టుబడుల వాతావరణ ప్రకటన" నివేదికలో పలు కీలక అంశాలను వెల్లడించింది. నివేదిక వెలువరిచన అభిప్రాయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మోదీ చెబుతున్న రీతిలో ఇండియాలో ఆర్థిక సంస్కరణలు లేవని రిపోర్టులో పేర్కొంది. గొప్పలు చెప్పుకోవడం తప్ప టార్గెట్లను ఏమాత్రం రీచ్ కాలేకపోతోందని తెలిపింది. భారత్ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయనుందని మోదీ చెప్పడం ఒట్టిమాటలే తప్ప అందులో నిజం లేదని ఏకిపారేసింది.
అయితే... అన్ని విషయాల్లో ఏకిపారేసిన ఆ రిపోర్టు విదేశీ పెట్టుబడుల నిబంధనల విషయంలో మాత్రం కొంత ఫరవాలేదంది. పాలన విషయంలోనూ మోడీకి మంచి మార్కులే వేశారు. అయితే.. ఇండియాలో గత ప్రభుత్వాలు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో పోలిస్తే మోడీ చేపట్టిన సంస్కరణలు చాలా నెమ్మదిగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఆర్థిక సంస్కరణల అమలులో మోడీ ప్రభుత్వం విఫలమవుతోందని.. జీఎస్టీ బిల్లుకు రాజకీయ మద్దతుపై ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపింది. అయితే.. ఎన్నిక ప్రతికూలతలు ఉన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో భారత్ ఒకటని వెల్లడించింది. ఇంతకాలం ఇండియాలో విపక్షాలు కూడా మోడీవన్నీ గొప్పలేనని విమర్శలు కురిపిస్తున్నా అంతర్జాతీయంగా ఆయనకు మంచి ఇమేజ్ వస్తుండడంతో గట్టిగా గళం విప్పలేకపోతున్నారు. తాజాగా అమెరికాయే మోడీ గాలి తీసేయడంతో ఇక విపక్షాలు మోడీ దుమ్ము దులపడానికి రెడీ అవుతున్నాయి.