దేశంలో ఒక్కరోజులో 29429 కేసులు.. 582 మరణాలు
భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 29429 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 582మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్నటి లెక్కలతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,36,181కి చేరుకుంది. ప్రస్తుతం 3,19840 యాక్టివ్ కేసులున్నాయి. 5,92,032మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం మరణించిన వారిసంఖ్య 24309కి చేరింది.
ప్రస్తుతం దేశంలోనే మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 267665కి చేరింది. 10695మంది చనిపోయారు. ఇక ఆ తర్వాత తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 147324కి చేరింది. 2099మంది చనిపోయారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 115346కి చేరింది. 3446 మంది చనిపోయారు. గుజరాత్ లో మొత్తం కేసుల సంఖ్య 43637కి చేరింది. 2069మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.92శాతంగా ఉంది. మరణాల రేటు 2.61 శాతంగా ఉంది.
*తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 33019కి చేరింది. ఇప్పటిదాకా 408 మరణాలు చోటుచేసుకున్నాయి. యాక్టివ్ కేసులు 15144గా ఉన్నాయి. కోలుకున్న వారు 17467గా ఉంది.
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 37745కి చేరింది. ఇప్పటిదాకా 375మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12530కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 24840కి చేరింది.