దేశంలో వైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 పాజిటివ్ కేసులు నమోదు కాగా 357 మంది వైరస్ తో చనిపోయారు. దేశంలో ఈ వైరస్ బయటపడిన తర్వాత 24గంటల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీనితో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2లక్షల 86వేల 579 కేసులు నమోదయ్యాయి.
ఇందులో యాక్టివ్ కేసులు 137448 ఉన్నాయి. అటు 1,41,028 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 357 మంది మహమ్మారి బారిన పడి మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 8102 కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్ర లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 90,787 795గా ఉంది. తమిళనాడు 34,914 - ఢిల్లీ 31,309 -గుజరాత్ 21,014 కేసులు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలే ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ కెనడాను దాటింది. ఇప్పటివరకు 12వ స్థానంలో ఉన్న భారత్ తాజా మరణాలతో ప్రపంచంలో 11వ స్థానానికి చేరింది. ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. తాజా కేసులతో 4వ స్థానంలో ఉన్న యూకేకి దగ్గరైంది. గడిచిన వారం రోజులుగా దేశంలో నిత్యం దాదాపు పదివేల కేసులతో పాటు 250కిపైగా మరణాలు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్క అగ్రరాజ్యం అమెరికాలోనే 20 లక్షల మందికి వైరస్ సోకిందని వెల్లడైంది. ప్రస్తుతానికి అక్కడ మరణాల సంఖ్య 1,12,754 గా ఉండగా జులై నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.