ఈమధ్యకాలంలో ఎన్నికల ఫలితాలపై వచ్చే సర్వేలు దాదాపు సక్సెస్ అవుతున్నాయి! ఈ క్రమంలో తాజాగా ఇండియా టుడే - యాక్సిస్ ఒక సర్వే చేసింది. ఈ సర్వే 2017లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సర్వే చెబుతున్న విషయాల ప్రకారం చూసుకుంటే బీజేపీ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. ఇదే సమయంలో బీఎస్పీ రెండో స్థానానికి పరిమితం కాగా, కాంగ్రెస్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉందని అనుకోవాలి. ఇదే సమయంలో యూపీ సీఎం అభ్యర్ధి విషయంలో కూడా సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం బీఎస్పీ కి శుభవార్తే!
ఈ సర్వే ప్రకారం వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుంటుదని తేలింది. ఇదే నిజంగా గనక జరిగే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందనే అనుకోవాలి. ఆ సర్వే ప్రకారం బీజేపీ తర్వాత బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) 115-124 సీట్లతో రెండోస్థానంలో నిలుస్తుంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి మాత్రం 94-103 స్థానాలే వస్తాయని, ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా 8-12 సీట్లకు మించి రావని తెలుస్తోంది.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో కూడా ఈ సర్వే ఫలితాలు ప్రకటించింది. ఈ విషయంలో బీఎస్పీకి సంతోషం కలిగిస్తూ... మాయావతికే పెద్దపీట వేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం మాయావతి సీఎం కావాలని 31 శాతం మంది కోరుతుంటే, ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ మళ్లీ సీఎం కావాలనేవాళ్లు 27 శాతంగానే ఉన్నారు. అలాగే అన్యూహ్యంగా ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటే మాత్రం ఆమెకు 2 శాతం మంది మద్దతు అని చెబుతుండగా... ములాయం సింగ్ యాదవ్ - షీలాదీక్షిత్ లకు కేవలం ఒక్కోశాతం మద్దతు మాత్రమే వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... 2012 ఎన్నికల తర్వాత యూపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని 54 శాతం మంది ముక్తకంఠంతో చెప్పడం. కాగా ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం... యూపీలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలున్నాయని తేలింది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/