సైనిక సంపదలో నెం.1 మన శత్రువే

Update: 2021-09-12 04:57 GMT
ఏ దేశంలోనైనా శాంతిభద్ర‌త‌, దేశాభివృద్ధి, ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాలంటే ఆదేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉండే సైనంపై ఆధార‌ప‌డుతుంది. శ‌త్రువులు దేశంలోకి చోర‌బ‌డి అల్ల‌ర్లు సృష్టించ‌కుండా సైన్యం గ‌స్తీ కాస్తుంది. అయితే జ‌ర్మ‌నీకి చెందిన ఓ సంస్థ సైన్యం ఎక్క‌వ‌గా ఉండే 10 దేశాల జాబితాను విడుద‌ల చేసింది. జ‌నాభా ప‌రంగా అధికంగా ఉన్నా చైనా.. సైన్యం అధికంగా ఉన్న దేశంగా మొద‌టి స్థానంలో నిలిచింది. ఇక బ్రిట‌న్ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.


త‌న అధిప‌త్యాన్నిపెంచుకోవ‌డంలో భాగంగా సైన త‌న సైనిక బ‌లాన్ని అదే రీతిలో పెంచుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా పై చేయి సాధించాల‌ని ఎత్తులు వేస్తోంది. ఇటివ‌ల ఈ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక ర‌క్ష‌ణ క‌లిగిన దేశాల జ‌బితాను జ‌ర్మ‌నీకి చెందిన డేటా బేస్ అనే కంపెనీ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో చైనా ముందువ‌రుస‌లో నిలిచింది.

డ్రాగన్‌ కంట్రీ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ ఆఫ్ చైనాగా ఆ కంపెనీ త‌న నివేదిక‌లో పేర్కొంది. త‌న ఆర్మీని ఐదు శాఖ‌లుగా వేరు చేసింది. అందులో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్‌, రాకెట్ ఫోర్స్‌, స్ట్రాట‌జిక్ స్ట‌పోర్ట్ ఫోర్స్ అంటూ శాఖ‌ల‌ను ఏర్పాటు చేసి ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద సైనిక ర‌క్ష‌ణ క‌లిగిన దేశంగా ఉంది. 2021లో చైనా సైన్యంలో  21,85,000. చేరారు. దీంతో చైనా అత్యంత సైనిక సిబ్బంది క‌లిగిన దేశంగా గుర్తింపు పొందింది.

చైనా త‌ర్వాత ఇండియా రెండో ఆర్మీ సిబ్బందిన్ని క‌లిగి ఉంద‌ని ఆ నివేదిక‌లో పేర్కొంది. ఇండియా ఆర్మీలో 14,45,000 సిబ్బంది ఉన్నారు. భార‌త దేశం కూడా త‌న ఆర్మీని కొన్ని శాఖ‌లుగా ఏర్పాటు చేసుకుంది. అందులో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాల‌లో సిబ్బంది ప‌ని చేస్తున్నారు.  అతిపెద్ద పారామిలిట‌రీ ఫోర్స్ ప్ర‌పంచంలోనే ఇండియా క‌లిగి ఉంది. దేశంలో ఆర్మీనే కాకుండా వివిధ విభాగాల‌లో దేశ ర‌క్ష‌ణ కోసం సిబ్బంది ప‌ని చేస్తున్నారు.ముఖ్యంగా ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ బస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండ‌గా, వివిధ రాష్ట్రాల‌లో పోలీసు సిబ్బంది ఆ రాష్ట్ర ర‌క్ష‌ణ కోసం ప‌ని చేస్తున్నాయి.  

ప్ర‌పంచ‌లోనే అత్యాధికంగా ఆయుధ సంప‌త్తి క‌లిగి ఉన్న ఆమెరికా ఈ నివేదిక‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆమెరికా సైనంలో మొత్తం 14,00,000 ప‌ని చేస్తున్నారు. ఈ దేశంలో కూడా వివిధ శాఖ‌లుగా ఏర్పాటు చేసి వారిలో సైనిక సిబ్బంది ఉన్నారు.  చైనా, భ‌ర‌త‌దేశం, ఆమెరికా త‌రువాత ఉత్తర కొరియా, రష్యా , పాకిస్తాన్ , దక్షిణ కొరియా , ఇరాన్ , వియత్నాం, సౌదీ అరేబియా ఇలా సైన్యాన్ని క‌లిగి ఉన్నాయి. భార‌త‌దేశానికి ఆమ‌డ దూరంలో ఉన్న బంగ్లాదేశ్ 2,04,000 ఆర్మీని క‌లిగి చివ‌రి స్థానంలో నిలిచింది.

పాకిస్తాన్ ఆర్మీసిబ్బంది సంఖ్య 6,54,000 ఉండ‌గా వాటిలో కూడా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలో సిబ్బంది ప‌ని చేస్తున్నారు. జ‌ర్మ‌నీకి చెందిన ఓ కంపెనీ విడుద‌ల చేసి జాబితాలో బ్రిటన్ గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అతిచిన్న దేశాలైన‌ ఈజిప్ట్, మయన్మార్, టర్కీ వంటి కంటె బ్రిట‌న్ సైన్యం త‌క్క‌వ‌గా పేర్కొంది. 2021  ఏప్రిల్  నాటికి బ్రిటన్  సైన్యంలో కేవ‌లం 1,59,000 మంది సిబ్బంది మాత్ర‌మే ఉన్నారు.  ఫ్రెంచ్ సైన్యం బ్రిటన్ కంటే పెద్దది.  2021 గణాంకాలలో ఫ్రెంచ్ సైన్యంలో క్రియాశీల ఆర్మీ సిబ్బంది 2,70,000. ఉన్నారు.
Tags:    

Similar News