కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ... క్రమక్రమంగా పుంజుకుంటుంది. ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు, రవాణా లాంటివి గాడిన పడడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఊరాయి. దీంతో ఈ ఆర్థిక ఏడాదిలో మొదటి త్రైమాసికంతో పోల్చుకుంటే.. రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు మరి కొంచెం పెరిగింది.
ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిపై కన్నువేసినా.. దానిని చేరుకునేందుకు మరి కొంత సమయం పట్టేలా ఉంది. ఈ తరుణంలో రెండో త్రైమాసికానికి సంబంధించిన వృద్ధి రేటు చాలా మంది ఆర్థికవేత్తలను తృప్తి పరిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలకు మించి నమోదైంది. గడిచిన త్రైమాసికంలో భారత దేశ జీడీపీ 8.4 శాతం మేర వృద్ధి రేటును సాధించింది.
అంతేగాకుండా కరోనా మహమ్మారి రెండో దశ నుంచి బయట పడిన తరువాత ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన దైన వృద్ధిని సాధించింది. భారత్ లాగా ప్రపంచ దేశాలు అన్నీ.. స్థాయికి మించి వృద్ధి చెందుతున్నా కానీ వివిధ దేశాల్లో కరోనా ఆనవాళ్లు ఇంకా వదిలిపోలేదు. నానాటికీ విస్తరిస్తున్న కరోనా వైరస్ కేసులు ప్రపంచ దేశాలను అందోళనకు గురి చేస్తుంటే.. మరో వైపు భారత్ మాత్రం స్థిర మైన వృద్ధి రేటు ను నమోదు చేయడం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఇదిలా ఉండే మరో వైపు గత ఆర్థిక సంవత్సరంలో భారత్ చాలా ఒడుదొకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉండే రేటింగ్ సంస్థలు భారత్ వృద్ధి రేటు పై అంచనాలు మరింతగా తగ్గించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయినట్లు కేంద్ర గణాంకాలు ప్రకటించాయి.
మరో వైపు మొదటి, రెండు త్రైమాసికాల్లో కలిపితే భారత్ వృద్ధి రేటు 13.7 గా నిలిచినట్లు ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. భారత్ లో ఈ ఆర్థిక ఏడాది ప్రారంభంలోని రెండు నెలలు రెండోదశ కరోనా ప్రభావం లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మలుపు తిరిగి ఉండేదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు.
రెండో త్రైమాసికంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన అంచనాల కంటే వృద్ధిరేటు భారీ స్థాయిలో నమోదు కావడం నిపుణులకు ఒకింత ఆనందాన్ని ఇచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక రేటింగ్ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పై ఉండే అంచనాలను కేవలం 7.8 నుంచి 8.4 శాతం వరకు మాత్రమే పరిమితం చేశాయి.
ఈ నేపథ్యంలో అన్ లాక్ కారణంగా ఒక్కసారిగా భారత్ భారీ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం శుభపరిణామం. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అంచనాల్లో ప్రధానమైంది... గతేడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో నమోదైన వృద్ధి కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే గతేడాది చాలా తక్కువగా నమోదైంది.
ఇలా చూస్తే ఈసారి వృద్ధి రేటు చాలా గొప్పగా నమోదైంది. ఈ త్రైమాసికానికి గానూ వ్యవసాయ రంగం కూడా అనుకున్నదాని కంటే కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ సారి దానికి వ్యవసాయ రంగం నమోదు చేసిన వృద్ధి 4.5గా ఉంది. మరోవైపు తయారీ రంగంలో 5.5 శాతం వృద్ధిని నమోదు చేయడం కూడా కీలక పురోగతికి సూచిక అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి రెండో ఆర్థిక త్రైమాసికంలో చైనా కూడా భారత్ చూపిన కీలక వృద్ధిని నమోదు చేయడంలో విఫలమైంది. కానీ భారత్ మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వలేదు.