బ్యాడ్మింటన్ లో భారత్ కి 'గోల్డ్'..చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్ !

Update: 2021-09-04 12:02 GMT
టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన సాగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఒకరిని మించి మరొకరి పథకమే లక్ష్యంగా బరిలోకి దిగి, పథకాలు అందుకుంటున్నారు. ఎదుటి వారిని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఇక, లేటెస్ట్ గా ప్రపంచ నెం.1 పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్ స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్ లో 2-0 తేడాతో ప్రత్యర్ధిని చిత్తు చేసిన స్వర్ణ పతకాన్ని నెగ్గాడు.

దీనితో చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ లో భారత్ కు ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు ప్రమోద్. ఇక, ఈ గేమ్స్ లో భారత్ కు ఇది ఓమొత్తంగా నాలుగో స్వర్ణ పతకం. బ్యాడ్మింటన్ ఎస్‌ ఎల్3 విభాగంలో బ్రిటీష్ షట్లర్‌ తో జరిగిన ఫైనల్‌లో 21-14, 21-17 తేడాతో వరుస సెట్లను గెలిచిన ప్రమోద్ భగత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన ప్రమోద్.. ఫైనల్ లో ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పదునైన స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థి ఆటకు చెక్ చెప్పాడు.

ఇక, ప్రమోద్ గోల్డ్ సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇది 16వ మెడల్, కాగా ఈ రోజు రెండో స్వర్ణం. అంతకుముందు శనివారం ఉదయం భారత మెన్స్ షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్‌రాజ్ ఆదాన రెండు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల షూటింగ్ మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడిన భారత షూటర్లు మనీష్ నర్వాల్ స్వర్ణం సాధించగా, సింగ్‌రాజ్ ఆదాన రజతం సాధించాడు. ఇప్పటిదాకా టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... పాయింట్ల పట్టికలో 25వ స్థానంలో కొనసాగుతోంది.



Tags:    

Similar News