భారత్, చైనాల మధ్య మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సరిహద్దు వివాదాలు మరోసారి పొడచూపాయి. దీంతో ప్రధాని మోడీ సీరియస్ గా స్పందించారు. వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తోనూ.. డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోనూ సమావేశమయ్యారు. విదేశాంగ శాఖ కార్యదర్శితోనూ భేటి అయ్యారు.
మరోవైపు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. త్రివిధ దళాధిపతులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సిక్కిం, లడఖ్ ప్రాంతాల్లో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
కాగా భారత్-పాకిస్తాన్-చైనా సరిహద్దుల్లో లడఖ్ సమీపంలో చైనా ఎయిర్ బేస్ నిర్మాణ పనులను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. టర్మాక్ లో చైనా ఫైటర్ జెట్లను మోహరించినట్టుగా సమాచారం. అయితే అధికారికంగా దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.