ప్ర‌పంచంలో మ‌న ఫోర్త్ ఎస్టేట్ తాజా ర్యాంక్ ఇది

Update: 2017-11-04 07:37 GMT
ప్ర‌జాస్వామ్య భార‌తంలో పాత్రికేయాన్ని నాలుగో స్థంభంగా చెబుతుంటారు  మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. మ‌న దేశంలో పాత్రికేయ స్వేచ్ఛ ఎంత‌? అన్న‌ది ప్ర‌శ్నించుకుంటే వ‌చ్చే స‌మాధానం తెలిస్తే నిరాశ త‌ప్పుదు. కాకుంటే.. ప‌క్క‌నున్న దేశాల‌తో పోల్చి చూసిన‌ప్పుడు మ‌నం బెట‌ర్ అని అనుకుంటాం కానీ.. మ‌న కంటే ముందున్న దేశాల్ని చూసిన‌ప్పుడు మ‌న స్వచ్ఛ ఇంతేనా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో నాలుగో స్థంభంగా భావించే పాత్రికేయానికి ఉన్న స్వేచ్ఛ అంతంత మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది తాజా రిపోర్ట్‌.  వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ఇండెక్స్ 2017ను విడుద‌ల చేశారు. ఇందులో అత్యంత దారుణ ప‌రిస్థితుల్లో జ‌ర్న‌లిస్టులు ఉన్న దేశం ఏదంటే చైనా అని చెబుతున్నారు.

మొత్తం 180 దేశాల్లో స‌ర్వే నిర్వ‌హిస్తే.. చైనాకు ద‌క్కిన స్థానం 176. ఇక చివ‌ర్లో ఉన్న నాలుగు దేశాల్ని ఊహించ‌టం అంత క‌ష్టం కాదు. చైనా త‌ర్వాతి స్థానాల్లో వియ‌త్నాం.. సిరియా నిలిచాయి. అంద‌రూ ఊహించిన‌ట్లే చివ‌రిస్థానంలో ఉత్త‌ర‌కొరియా నిలిచింది. ఇక‌.. భార‌త‌దేశానికి వస్తే మీడియాస్వేచ్ఛ ఎక్కువ అని చెప్పే మ‌న ద‌గ్గ‌ర ప్రెస్ ఇండెక్స్ లో 136వ ర్యాంకు ల‌భించింది. పొరుగున ఉన్న పాక్ కంటే మ‌న మీడియా స్వాతంత్య్రం ఎక్కువ‌ని పేర్కొంది.

పాక్ లో జ‌ర్న‌లిస్టుల‌పై అధికంగా హ‌త్యాయ‌త్నాలు జ‌రుగుతుంటాయ‌ని నివేదిక వెల్ల‌డించింది. ఇక‌.. మీడియా స్వేచ్ఛ‌కు స్వ‌ర్గ‌ధామంగా నార్వే.. స్వీడ‌న్‌.. ఫిన్లాండ్‌.. డెన్మార్క్‌.. నెద‌ర్లాండ్స్ దేశాలు టాప్ ఫైవ్ గా నిలిచాయి.
Tags:    

Similar News