భారతసైన్యం మెరుపుదాడులు..ఎప్పుడు? ఎక్కడంటే?

Update: 2019-09-10 04:55 GMT
ఆర్టికల్ 370 నిర్వీర్యం.. తదితర నిర్ణయాలతో ఉడికిపోతున్న దాయాది.. భారత్ మీద తన అక్కసును ఏదో రూపంలో వెళ్లగక్కుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజంలో తరచూ జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తటమే కాదు.. దుర్మార్గంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలకు మద్దతు ఇస్తూ.. భారత్ లోకి పంపే దుర్మార్గానికి తెర తీస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ అక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం తాజాగా మెరుపుదాడులు చేపట్టింది.

పాక్ ఆర్మీ పోస్టులకు సమీపంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై తాజాగా భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. గడిచిన కొద్ది రోజులుగా భారత సరిహద్దు గ్రామాలపై తరచూ మోర్టారు దాడులు.. కాల్పులకు తెగబడుతోంది పాక్ సైన్యం. కాల్పుల క్రమంలోనే ఉగ్రవాద స్థావరాలు వెలవటం.. అక్కడి వారిని వీలు చూసుకొని భారత్ లోకి ప్రవేశించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

పాక్ దుర్మార్గాన్ని గుర్తించిన భారత సైన్యం.. చొరబాటు ప్రయత్నాలు ఆదిలోనే అడ్డుకోవటమే కాదు.. తాజాగా వారి స్థావరాలపైనా దాడులు నిర్వహించింది. జమాతే ఇస్లామీ నిర్వహిస్తున్న ఈ ఉగ్రవాద శిబిరాల్లోని ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ లోకి చొరబడి.. భద్రతా బలగాల మీద కానీ.. ఏదైనా ప్రార్థన స్థలంలో కానీ భీకరదాడి చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. లష్కరే తయిబాకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని సోపోర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. కశ్మీర్ అంశంపై మోడీ సర్కారు వరుస నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. స్థానిక వ్యాపారుల్ని బెదిరిస్తూ.. దుకాణాలు తెరవకూడదని ఉగ్రవాదులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుంది భద్రతా వర్గాలు. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులతో రెండు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
Tags:    

Similar News