కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలంగా మారుతోంది. భారత్ - పాకిస్తాన్ లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ కరోనా ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం వక్రబుద్దితో ఇదే అదునుగా ఉగ్రవాదులను భారత్ లోకి ఎగదోసేందుకు కుట్రలు పన్నుతోంది.
తాజాగా నేపాల్ మీదుగా.. మన దేశంలోకి 200 మంది కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నిందని ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి హెచ్చరికలు చేశారు. దీంతో అలెర్ట్ అయ్యి నేపాల్ సరిహద్దుల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఇక తాజాగా కశ్మీర్ బార్డర్ నుంచి పెద్ద ఎత్తున భారత్ లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. భారత్ సైన్యం కూడా ఎదురుదాడి చేస్తోంది.
శుక్రవారం కుప్వారా సెక్టర్ లో ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. దీనికి అలెర్ట్ అయిన భారత్ సైన్యం.. సరిహద్దుకు సమీపంలో ఉన్న టెర్రర్ లాంచర్ ప్యాడ్లను టార్గెట్ చేసుకొని కాల్పులకు దిగింది. ఈ దాడి లో పాకిస్తాన్ కు భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఉగ్రశిబిరాలు - పాకిస్తాన్ లక్ష్యాలతో పాటు ఓ లాంచ్ ప్యాడ్ కూడా ఈ దాడుల్లో ధ్వంసమై ఉంటుందని భారత ఆర్మీ అధికారులు ఒక వీడియోను సైతం విడుదల చేశారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.
Full View