నిబంధనలు - ఒప్పందాలు ఉల్లంఘించి కుప్వారాలోని తంగ్ ధార్ సెక్టార్ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు - ఓ పౌరుడు మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందంను ఉల్లంఘించి పాక్ జవాన్లు చేసిన చర్యకు భారత భద్రతా బలగాలు వెంటనే జవాబు ఇచ్చింది. మన జవాన్లు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాక్ జవాన్లు హతమయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని నీలం లోయలో నాలుగు లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది.
కాల్పులను తిప్పికొట్టే పనిలో భారత సైన్యం ఉంటే ముష్కరులు చొరబడొచ్చని పాక్ పన్నాగం. దీన్ని పసిగట్టిన మన సైన్యం.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పేందుకు ఇవాళ ఉదయం స్ట్రాంగ్ కౌంటర్ కు దిగింది. నేరుగా పీవోకేలో ఉన్న ఉగ్ర క్యాంపులపైనే ఆర్టిలరీ గన్స్ తో అటాక్ మొదలుపెట్టింది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేసింది. తంగ్దార్ సెక్టార్‌కు ఎదురుగా పీవోకేలోని స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. ఉగ్రవాద స్థావరాలను ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి ధ్వంసం చేశారు. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు ఈ ఆపరేషన్‌లో పది, పదిహేను మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. మొత్తంగా భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ చేసే చర్యలను భారత జవాన్లు సమర్థంగా నిలువురించారు.
మరోవైపు, జమ్ము కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సరిహద్దులోని గ్రామాల ప్రజలు. మోడీజీ… పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ స్థానిక ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే తాము చాలా కష్టనష్టాలు అనుభవించామని, ఇకనైనా దాయాది దేశానికి తగిన శాస్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.