పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు యూరీ సెక్టార్లో జరిపిన దాడుల్లో సైనికుల ప్రాణాలు పోవడంతో భారత సైన్యం రగిలిపోతోంది. పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేస్తోంది. తమకు ఒక్క ఛాన్సిస్తే సరిహద్దులు దాటివెళ్లి పాకిస్థాన్ పని పడతామని అంటున్నారు.
పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని మన సైన్యం ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది. పాక్ పై దాడికి తమను అనుమతించాలని సైనికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటోంది. దీంతో సహజంగానే మన సైనికుల్లో ఆగ్రహావేశాలున్నాయి. తాజాగా యూరీ దాడితో వారు మరింత మండిపడుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం దీనిపై ముందువెనుకా ఆలోచిస్తోంది. సైన్యానికి ఒకసారి అనుమతిస్తే అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయని భావిస్తున్న కేంద్రం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోంది. పఠాన్ కోట్ - యూరీ ఆర్మీ పోస్టులపై ఉగ్రదాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా మిగతా దేశాల నుంచి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ తో యుద్దానికి వెనుకాడుతోంది. సైనికులు మాత్రం గవర్నమెంటు ఊ అంటే చాలు పాక్ పని పడతామని అంటున్నారు.