లండ‌న్ కార్పొరేష‌న్ స‌భ్యురాలిగా ఇండియ‌న్‌

Update: 2017-05-21 10:15 GMT
భార‌తీయ మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కంది. లండన్ నగర కార్పొరేషన్‌కు ఓ భారతీయ మహిళ ఎన్నికైంది. రేహానా అమీర్(43) చెన్నైలో పుట్టి పెరిగారు. యూకేలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. దేశంలోనే అత్యంత ధనిక బడ్జెట్ కలిగిన లండన్ నగర కార్పొరేషన్లో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. వింట్రీ వార్డు తరపున రేహానా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కోర్టు ఆఫ్ కామన్ కౌన్సిల్ కౌన్సిలర్‌ గా ఎన్నికయ్యారు. దీంతో లండన్ కార్పోరేషన్‌ కు ఎన్నికైన మొదటి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.

తన ఎన్నిక అనంతరం ఆమె స్పందిస్తూ.. రోడ్డు భద్రత తన మొదటి ప్రాధాన్యాంశంగా పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి పెంపొందించేందుకు చర్యలు చేపడతామన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా స్థానికంగా ఉన్న వ్యాపార అవకాశాలను అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News