ట్రంప్ వ్యతిరేక బ్యాచ్ లోకి భారత నిపుణురాలు

Update: 2020-07-01 09:13 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే ట్రంప్ పై వ్యతిరేకత రోజురోజుకు వ్యక్తమవుతోందని సర్వేలు తేల్చాయి. దీంతో జోబిడెన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా డిజిటల్ పబ్లిసిటీ పనులు చేపట్టేందుకు చీఫ్ గా ఇండో-అమెరికన్ మేధా రాజ్ ను నియమించారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి ఎన్నికలు పూర్తిగా వర్చువల్ గా కొనసాగుతున్నందున  మేధారాజ్ కత్తి మీది సాము కానున్నది.  అయితే డిజిటల్ రంగంలో అత్యంత అనుభవం.. క్రియాశీలత.. చురుకుదనం మేధారాజ్ సొంతం. అందుకే అన్ని అంశాల పై అవగాహన ఉన్న మేధారాజ్ను బిడెన్ ఏరికోరి ఎన్నికల ప్రచారానికి నియమించడం విశేషం.

ట్రంప్ ను ఓడించడమే ధ్యేయంగా ప్రచార ఫలితలను ప్రభావితం చేయడమే డిజిటల్ ప్రచారం పని. ఎన్నికలకు ఇంకా 130 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మేధారాజ్ బాధ్యతలు స్వీకరించినట్టు తన సోషల్ మీడియాలో తెలిపారు.

మేధారాజ్ గతంలో పీట్ బుటిగిగ్ ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన మేధారాజ్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఏంబీఏ చేశారు.
Tags:    

Similar News