పాకిస్తాన్ కు దిమ్మదిరిగే కౌంటర్ యాడ్

Update: 2019-06-16 04:28 GMT
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్. ఈ హైటెన్షన్ మ్యాచ్ కోసం ఇండియా పాకిస్తాన్ ప్రజలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇటీవల పాకిస్తాన్ కు చెందిన ‘జాజ్ టీవీ’ భారత హీరో అభినందన్ వర్ధమాన్ ను అవమానిస్తూ ఓ యాడ్ రూపొందించిన సంగతి తెలిసిందే. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ‘వీ సెవెన్ పిక్చర్స్’ అనే యూట్యూబ్ చానెల్ తాజాగా పాకిస్తాన్ అభినందన్ యాడ్ కు కౌంటర్ గా ఓ వీడియోను రూపొందించింది.దీన్ని భారత అభిమానులు షేర్ చేస్తూ పాకిస్తాన్ కు కౌంటర్ ఇస్తున్నాడు.

ఓ సెలూన్ షాప్ కు వచ్చిన పాకిస్తాన్ అభిమాని..భారత అభిమానికి ఆదివారం ఫాదర్స్ డే గిఫ్ట్ ఇస్తాడు. అందులో కర్చీఫ్ ఉంచి.. ఇండియా ఈరోజు ఓడిపోతుందని.. చెమటలు పడితే ఈ రుమాలుతో తుడుచుకోండని సెటైర్ వేస్తాడు. దానికి భారత అభిమానితో సదురు బార్బర్ ఖిన్నులవుతారు. ఇక ఆఫ్రిది స్టైల్ షేవింగ్ చేయమని పాకిస్తాన్ అభిమాని కోరగా.. భారత బార్బర్.. ‘అభినంధన్ స్టైల్’ గన్ స్లింగ్లర్ గడ్డం చేస్తాడు. దీంతో షాక్ అయిన పాకిస్తాన్ అభిమానికి ఇదే రూమాలు ఇచ్చి.. ఇప్పుడు మీకు చెమటలు పడుతాయి.. ఈ ఖర్చీఫ్ నీ దగ్గరే ఉంచుకో అని కౌంటర్ ఇస్తారు.

ఇలా పాకిస్తాన్ అభినందన్ ను అవమానిస్తూ వీడియో రూపొందిస్తే.. భారత అభిమానులు దానికి కౌంటర్ గా వీడియో రూపొందించి పాకిస్తాన్ కు షాకిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Full View

Tags:    

Similar News