వైరస్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి..భారత సంతతి వైద్యుడి ఘనత!

Update: 2020-06-13 00:30 GMT
అమెరికాలో భారత సంతతికి చెందిన వైద్యుడు , థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ అరుదైన సర్జరీ చేశారు. షికాగోలో వైరస్ తో బాధపడుతున్న ఓ యువతికి రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. ఈ వైరస్‌ బారినపడిన ఓ యువతి రెండు ఊపిరితిత్తులు పాడైపోగా, వైద్యులు రెండింటినీ విజయవంతంగా మార్చారు. షికాగో , నార్త్ ‌వెస్టర్న్ మెడిసిన్‌ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువతి చేరింది.

కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన వైద్యులు వాటిని మార్చాలని నిర్ణయించారు. ఆమెకు ఊపిరితిత్తులు మార్చకుంటే చనిపోతుంది అని  శస్త్రచికిత్స చేశారు. ఈ మహమ్మారి ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్‌ లో ఇదే మొదటి శస్త్రచికిత్స అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ..‘నేను చేసిన కష్టతరమైన ఆపరేషన్ ‌లలో ఇది ఒకటి. ఇది చాలా సవాలుతో కూడుకున్న కేసు. ఈ వైరస్ సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడి చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు, హృదయం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థ పని తీరు దెబ్బ తింటుంది అని తెలిపారు. వైరస్ పేషంట్లకు ఇది ఒక్కటే సరైన మార్గం అని ఆయన అన్నారు.

ఆపరేషన్‌ జరిగిన యువతి ప్రస్తుతం వెంటిలేటర్‌ పై ఉన్నదని.. పూర్తి స్థాయిలో ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు.  ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒక్కటే ఆమెకు ఉన్న ఆప్షన్‌ అని, అందుకే ఆమెకు ఆ సర్జరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వైరస్ తో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే ఆస్పత్రుల్లో‌ ఈ సర్జరీపై దృష్టి పెట్టాలన్నారు.
Tags:    

Similar News