కేజ్రీవాల్ కి సైనికుల స‌మాధానం ఇదేన‌ట‌!

Update: 2016-10-10 13:47 GMT
పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో పొంచి ఉన్న ముష్క‌ర మూక‌ల‌పై భార‌త సైన్యం జ‌ర్జిక‌ల్ దాడులు చేసింది. ఉగ్ర స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. అయితే, ఆ విష‌యాన్ని పాకిస్థాన్ ఒప్పుకోవ‌డం లేదు! దాడులు జ‌ర‌గ‌లేద‌ని బుకాయిస్తోంది. ఇదే సంద‌ర్భంలో మోడీ స‌ర్కారుకు స‌లామ్ చేస్తూనే దాడుల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ వివాదాస్ప‌దుల‌య్యారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌! దాడుల‌కు సంబంధించిన వీడియో విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. సైనిక దాడిని ఒక రాజ‌కీయ అంశంగా మార్చేశారనే విమర్శను మూటగట్టుకున్నారు. కేజ్రీవాల్ కామెంట్స్ కి పాకిస్థాన్ కి కూడా కొమ్ములొచ్చిన‌ట్ట‌యింది! అయితే, స‌ర్జిక‌ల్ దాడుల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న కేజ్రీవాల్ తోపాటు మ‌రికొంద‌రికి స‌మాధానం అన్న‌ట్టుగా ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. యూట్యూబ్ లోకి వ‌చ్చిన రెండ్రోజుల్లోనే ట్రెండింగ్ లో క‌నిపిస్తూ ప్ర‌జాద‌ర‌ణ పొందుతోంది.

"సర్జికల్ స్ట్రైక్... ఎ రిప్లై వీడియో ఫ్ర‌మ్ ఇండియ‌న్ సోల్జ‌ర్ టు కేజ్రీవాల్‌ - ద‌స‌రా స్పెష‌ల్‌" అనే టైటిల్ తో వ‌చ్చింది ఈ వీడియో. ఇద్ద‌రు సైనికులు స‌రిహ‌ద్దులో ప‌హారా కాస్తుంటారు. ఎదురుగా వ‌స్తున్న ఉగ్ర‌వాదుల‌ను గుర్తించి కాల్చి చంపేస్తారు. అక్క‌డి నుంచి వెళ్లిపోబోతుంటే.. ఈ శవాల‌ను తీసుకెళ్దాం అని ఒక సైనికుడు అంటాడు. అవస‌రమా? అని మ‌రో సైనికుడు ప్ర‌శ్నిస్తే... "మ‌నం వీళ్ల‌ను చంపామ‌న్న గ్యారంటీ ఏముంటుంది" అని అడుగుతాడు. "రావణాసురుడిని రాముడు చంపేసి అయోధ్య‌కి తిరిగొచ్చాడు. ఎవ్వ‌రూ సాక్ష్యాలు అడ‌గ‌లేదు క‌దా" అంటాడు మొదటి సైనికుడు. "కానీ, అలాంటి ప్ర‌శ్న‌లు అడిగేందుకు ఈ రామాయ‌ణంలో విభీష‌ణుడు ఉన్నాడు" అంటాడు. "కానీ, విభీషణుడు రావణ్ బ్రదర్ కదా" అని ఒక సైనికుడు అడగ్గా... "రామాయ‌ణంలో ఆయ‌న రాముడు సోద‌రుడులే. కానీ రాముడికి యాంటీగా పోరాటం చేస్తున్నాడు" అంటాడు మరో సైనికుడు. "ఎవ‌డా విభీష‌ణుడు... ఆ మ‌ఫ్ల‌ర్ టోపీ పెట్టుకుంటాడు, ఆయ‌నేనా" అని అడుగుతాడు. అయితే "ఈ రామాయ‌ణంలో చిన్న ఛేంజ్‌. ద‌స‌రాలో రావ‌ణుడి కంటే ముందు ఈ విభీష‌ణుడిని కాల్చేస్తే స‌రిపోతుంది" అనేసి ఇద్ద‌రూ న‌వ్వుకుంటారు.

ఒక సైనికుడు క్షేమంగా ఉన్నాడంటేనే దేశం క్షేమంగా ఉంద‌న‌డానికి సాక్ష్యం అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫిల్మ్ ముగుస్తుంది. స‌ర్జిక‌ల్ దాడులు గురించి సాక్ష్యాలు అడుగుతున్న వారికి ఇదే స‌మాధానం అన్న‌ట్టుగా దీన్ని చిత్రీక‌రించారు.
Full View



Tags:    

Similar News