ప్రపంచ పెద్దన్న అమెరికాకు ఈ మధ్య టైం బాగోవటం లేదు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో అమెరికన్లు కిందామీదా పడుతున్నారు. హర్వే హరికేన్ సృష్టించిన బీభత్సంలో దాదాపు కోటి మందికి పైనే ప్రభావితమైన పరిస్థితి. బాధితులు లక్షల్లో ఉన్నారు. పలువురి మరణానికి కారణమైన హార్వీ హరికేను పుణ్యమా అని మరో భారతీయ విద్యార్థిని మరణించారు.
టెక్సాస్ నగరాన్ని వణికించిన హార్వీ హరికేన్ కారణంగా 25 ఏళ్ల షాలిని సింగ్ మృత్యువాత పడ్డారు. ఢిల్లీకి చెందిన షాలిని సింగ్ గత నెలలోనే అమెరికాకు వెళ్లారు. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె ఎఏం వర్సిటీలో పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.స్నేహితుడు నిఖిల్ భాటియాతో కలిసి బ్రేయాన్ లేక్ లో స్విమ్మింగ్ చేస్తున్న షాలిని ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకున్నారు. ఆమెతో పాటు స్విమ్మింగ్ చేస్తున్న భాటియా సైతం వరదల్లో కొట్టుకుపోయారు.
ఈ ఇద్దరిని కాపాడి ఆసుపత్రికి చేర్చినా ఇద్దరు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన భాటియా.. షాలినిలకు అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇద్దరు భారతీయులు అనూహ్యంగా మృత్యువాత పడటం తీవ్ర విషాదంగా మారింది.