దేశం కాని దేశంలో అమ్మాయి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడో భారతీయ యువకుడు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో జరిగిన ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అకౌంటింగ్ విద్యార్థి అయిన మౌలిన్ రాథోడ్ కు డేటింగ్ సైట్లో ఒకమ్మాయి పరిచయం అయింది. ఒంటరిగా ఉంటున్న ఆమె కోసం వెళ్లిన యువకుడికి ఏమైందో ఏమో కానీ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువతి ఇంట్లోనే తీవ్ర గాయాలతో ఉండగా హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ మరణించాడు.
మెల్ బోర్న్ లోని సన్ బరీ సబర్బ్ లో ఉన్న19 ఏళ్ల యువతి ఇంటికి రాథోడ్ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత రాథోడ్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్టు అత్యవసర సేవలకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
కాగా రాథోడ్ మరణం తరువాత యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆమె అతడిని గాయపరిచినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. బాధితుడు మృతి చెందడంతో ఇప్పుడు దానిని హత్యకేసుగా మార్చనున్నారు. నిందితురాలైన యువతిని కోర్టు పోలీసుల కస్టడీకి పంపింది. తమ ఒక్కగానొక్క కొడుకు మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. రాథోడ్ చాలా మంచి వ్యక్తని - క్రికెట్ అంటే ప్రాణమని ఆయన మిత్రులు చెబుతున్నారు.