వ్యాపారాన్ని పెంచుకోవటానికి బోలెడన్ని మార్గాలు. తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి.. కొందరు తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు వచ్చిన అవకాశాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి ప్రముఖ థీమ్ పార్కు ప్రకటించింది. హైదరాబాద్ శివారులోని శామీర్ పేటతో పాటు.. బెంగళూరు..కొచ్చి నగరాల్లో వీరి థీమ్ పార్కులు ఉన్నాయి.
ఇదంతా ఎందుకంటే.. అమెరికా ఉపాధ్యక్షరాలిగా కమలా హ్యారిస్ ప్రమాణస్వీకరం చేసి.. పదవీ బాధ్యతల్ని చేపట్టిన నేపథ్యంలో వండర్ లా థీమ్ పార్కు సరికొత్త ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో దాన్ని సెలబ్రేట్ చేసేందుకు వీలుగా వండర్ లా ఒక ఆఫర్ ను ప్రకటించినట్లు పేర్కొంది.
వీరు వెల్లడించిన వివరాల ప్రకారం కమలా.. కమలమ్మ.. ఇలా కమలాకు దగ్గగా పేరు ఉంటే చాలు.. వారికి తమ థీమ్ పార్కు ప్రవేశాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. కమలా హ్యారిస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తామీ ఆఫర్ ను ప్రకటించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే పరిమితమని చెబుతున్నారు . జనవరి 24న తమ థీమ్ పార్కులోకి వచ్చే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల్నిసోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే.. ఈ ఆఫర్ కు ఒక చిన్న ట్విస్టు పెట్టారు. ఈ ఆఫర్ మొదటగా వచ్చిన వంద మందికి మాత్రమేనని తెలిపారు. అన్ని బాగున్నాయి కానీ.. ఈ వంద పరిమితి మాత్రం బాగోలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.