హెచ్1 బీ రిజిస్ట్రేషన్లలో భారతీయులే టాప్

Update: 2020-04-03 13:00 GMT
హెచ్1 బీ వీసా.. అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇదో కలల వీసా.. ప్రస్తుతం అమెరికా అల్లకల్లోలంగా మారింది. కరోనాతో అట్టుడుకుతోంది. ట్రంప్ విదేశీయులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయినా ఇన్ని ఆంక్షలున్నా సరే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసిన వారిలో భారతీయులదే అగ్రస్థానం కావడం విశేషం.

అమెరికా హెచ్1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాజాగా ముగిసింది. ఇక లాటరీ విధానంలో వీసాలను జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యం లోనే అమెరికా యూఎస్సీఐఎస్ నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

*నివేదిక సారాంశం
మొత్తం అమెరికాలో ఈసారి 2.75 లక్షల మంది హెచ్1బీ వీసాల కోసం రిజిస్టేషన్ చేసుకున్నారు. ఇందులో 68శాతం భారతీయులే కావడం గమనార్హం. మొదటి స్థానంలో భారతీయులు 13.20శాతం ఉండగా.. రెండోస్థానంలో చైనా వాసులున్నారు.

ఇక అమెరికన్ కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్1 బీ వీసా కోసం సిఫార్సు చేయాలి. ఆయా కంపెనీలు భారతీయ ఉద్యోగులనే ఎక్కువగా సిఫార్సు చేస్తున్నాయి. లాటరీ విధానంలోనే ఈ హెచ్1 బీ వీసాలకు ఎంపిక చేస్తారు. 65వేల హెచ్1 బీ వీసాల కోసం లాటరీ ప్రక్రియ పూర్తయినట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. అక్టోబర్ లో ఈ హెచ్1 బీ వీసాలను జారీ చేస్తారు.

భారతీయులకు అమెరికా ఆసక్తి ఎక్కువ. అమెరికా కంపెనీలు కూడా భారతీయ ఉద్యోగులను నియమించుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. భారతీయులు తెలివైన వారు, సృజనాత్మకత ఉన్నవారు, కష్టపడేతత్వం ఎక్కువ ఉన్న ఇండియన్స్ నే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. 
Tags:    

Similar News