వూహాన్ వైరస్ తో వణికి పోతున్న చైనా నుంచి ఆయా దేశాలకు చెందిన వారిని వారి.. వారి దేశాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా వూహాన్ లో ఉన్న భారతీయుల్ని ఎయిరిండియా ప్రత్యేక బోయింగ్ విమానం అజంతాలో ఢిల్లీకి తీసుకొచ్చారు. శుక్రవారం వూహాన్ నుంచి బయలు దేరిన విమానం ఈ ఉదయం (శనివారం) ఢిల్లీకి చేరుకుంది.
విమానం ల్యాండ్ అయిన వెంటనే.. విమానంలోని 324 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు జరిపారు. వారిని ఢిల్లీలోని మానేసర్.. ఛావల్ క్యాంపులకు తరలించారు. రెండు వారాల పాటు వారిని అక్కడే ఉంచి.. వైద్యాధికారుల పరీక్షల తర్వాతే.. వారిని వారి ప్రాంతాలకు పంపించనున్నారు. అంతేకాదు.. కరోనా బాధితుల కోసం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో యాబై పడకలతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు.
భారత సైన్యానికి చెందిన ప్రాంతం లో వూహాన్ నుంచి వచ్చిన వారిని ఉంచనున్నారు. ఢిల్లీకి సమీపం లోని మనేసర్ లో వీరి కోసం ప్రత్యేకంగా ఒక క్వారంటైన్ ను నిర్మించారు. మరో విమానం కూడా చైనా కు వెళ్లింది. వారిని కూడా ఇదే రీతిలో ప్రత్యేకమైన క్యాంపుల్లో ఉంచి.. ఆ తర్వాతే వారిని వారి స్వస్థలాలకు పంపించనున్నారు. పద్నాలుగు రోజుల పాటు.. ఈ క్యాంపుల్లో ఉండాల్సి ఉంటుంది.