అమెరికాలో 'కాంట్రాక్ట్ మ్యారేజ్'ల పేరుతో మోసం: పట్టుబడ్డ భారతీయులు

Update: 2022-11-01 04:49 GMT
అమెరికా లో కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరిట మోసం వెలుగుచూసింది. వివాహ మోసాల్లో భారతీయులు  పట్టుబడడం కలకలం రేపుతోంది.యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో ఈ వివాహ మోసాలను పెద్ద స్కాంగా అభివర్ణిస్తున్నారు.  3 సంవత్సరాలుగా ఈ స్కాం జరిగినట్టు తెలుస్తోంది.
 
జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేది పెళ్లి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలంటే అయితే ఏదైనా వృత్తి, ఉద్యోగ, ఉపాధిలో ఉండాలి. లేదంటే అమెరికన్లను వివాహం చేసుకోవాలి. ఈ రెండోదారినే కొందరు క్యాష్ చేసుకున్నారు. అమెరికన్లతో వివాహం అన్నట్టు నాటకం ఆడి వారికి భారీగా డబ్బులు ఇచ్చి మరీ ఈ కాంట్రాక్ట్ వివాహాలు చేసుకున్నారు. ఈ భారీ మోసం అమెరికాలో వివాహాల మోసంగా పేరుగాంచింది.

హృతిక్ రోషన్ నటించిన కైట్స్‌ సినిమాలో ఇదే చూపించారు. అమెరికాలో చట్టబద్ధంగా ప్రవేశించడానికి ఒక మెక్సికన్‌ను హృతిక్ రోషన్ వివాహం చేసుకున్నాడు. ఈ 'కాంట్రాక్ట్ మ్యారేజీ' అనే అంశం మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు, అమెరికా అధికారులు కూడా ఇలాంటి భారతీయులు చేసిన మోసాన్ని పసిగట్టారు.  

భారతీయ సంతతికి చెందిన వారు తాజాగా ఈ కాంట్రాక్ట్ మోసంలో పట్టుబడ్డారు.  గ్రీన్ కార్డ్ పొందడం కోసం అమెరికన్ పౌరులను కాంట్రాక్ట్ మ్యారేజ్ లు చేసుకున్నారు.  భారతీయులు ఇలా నకిలీ పెళ్లిళ్లతో గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేశారు. ఈ మోసాన్ని అండర్‌కవర్  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు చాకచక్యంగా కాంట్రాక్ట్ పెళ్లిళ్ల కోసం సంప్రదించి..  వారిని ట్రాప్ చేయడానికి 'వివాహ మోసం' రాకెట్‌లో పాల్గొన్న కొంతమందిని 'వివాహం' చేసుకున్నారు.

నిందితుల్లో అమేలియా ఆడమ్స్, బార్బరా యాటర్, వివేక్ పటేల్ తదితరులు ఉన్నారు. ప్రమేయం ఉన్నవారు నిర్ణీత డబ్బులు తీసుకొని బదులుగా వివాహం చేసుకుంటారు.  వివాహ వేదిక నుండి చిత్రాల వరకు మిగిలిన పేపర్ వర్క్ వరకు ప్రతిదీ బ్రోకర్లు చూసుకుంటారు.

మరో నిందితుడు విశాల్ కుమార్ చబ్రియా( 41), వివాహ మోసానికి కుట్ర పన్నినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇతడిపై అభియోగానికి 5 సంవత్సరాల జైలు శిక్ష , $250,000 జరిమానా విధించబడుతుంది. అలాగే నిందితులుగా ఉన్న భారతీయులైన దిశాంత్ పటేల్ , శ్వేతా పటేల్ కూడా గ్రీన్ కార్డ్‌ల కోసం మోసపూరిత వివాహాల్లోకి ప్రవేశించి రహస్య అధికారులను 'పెళ్లి చేసుకున్నారు. వీరిని పట్టుకున్న అమెరికన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News