దేశం కాని దేశం వెళ్లి.. అక్కడి వేష.. భాషలతో పాటు.. సంస్కృతిలో ఇమిడిపోయే తత్త్వం భారతీయులకు ఎక్కువే. అంతేకాదు విదేశంలో ఉన్నా స్వదేశాభిమానమూ వదులుకోరు. ఈ కారణంతోనే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడి వారితో కలిసిపోయి భారతీయులు నెట్టుకురాగలుగుతారు. తాజాగా భారతీయులకు సంబంధించిన ఒక ఆసక్తికర కోణం బయటకొచ్చింది.
ఒక అమెరికన్ కమ్యూనిటీ 2009 నుంచి 2013 మధ్య కాలంలో తమ దేశంలో నివసిస్తున్న భారతీయుల మీద ఒక అధ్యయనం చేపట్టారు. అమెరికా సమాజంలో ఉండే భారతీయులు ఇంట్లో ఉన్నప్పుడు ఏ భాషను మాట్లాడతారు అన్న అంశంతో పాటు.. అమెరికాలో ఉండే మిగిలిన దేశీయులు ఏ భాషను మాట్లాడతారన్న అంశంపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తంగా చూస్తే.. అమెరికాలో నివసించే భారతీయుల్లో అత్యధికశాతం ఇంట్లో మాతృభాషనే వినియోగిస్తున్నట్లు తేల్చారు. బయట ఉన్నప్పుడు ఇంగ్లిషు దంచేసే భారతీయులు.. బయట నుంచి ఇంటికి వచ్చేస్తే మాత్రం అమ్మ భాషలోనే మాట్లాడుకుంటారని తేల్చారు.
అమెరికాలో హిందీ మాతృభాషీయులు 6.5 లక్షల మంది తమ ఇళ్లల్లో హిందీనే మాట్లాడతారని తేల్చారు. అదే విధంగా ఉర్దూ.. గుజరాతీ మాట్లాడే వారు 4 లక్షల మంది..తెలుగువారు 2.5లక్షల మంది తమిళం మాట్లాడే వారు 1.9లక్షలమంది ఉండగా మలయాళం మాట్లాడే వారు 1.46 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు.
ఇంగ్లిషు కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిలో అగ్రస్థానం స్పానిష్ కు దక్కింది. ఈ భాషను అమెరికాలో 37.4 లక్షల మంది మాట్లాడుతున్నట్లు తేలింది. చైనీయులు 2.9లక్షల మంది తమ మాతృభాషను మాట్లాడితే.. ఫ్రెంచ్ మాట్లాడే వారి సంఖ్య 1.3లక్షలుగా తేల్చారు. కొరియన్లు.. జర్మన్లు తమ మాతృభాషలో మాట్లాడే వారు దాదాపు 1.1లక్షల మంది ఉంటారని తేల్చారు. ఎంత విదేశంలో ఉన్నా అమ్మ భాష.. అమ్మభాషే కదా.