'ఇండియ‌న్స్‌'కు అమెరికాలో ఇక‌..రాయ‌ల్ ఎంట్రీ

Update: 2017-06-28 05:02 GMT
స్నేహంగా ఉండ‌టం వేరు. ఆ స్నేహ ఫ‌లాల్ని దేశానికి అందేలా చేయ‌టం వేరు. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌ర్వాత నుంచి విదేశాంగ విధానంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ పుణ్య‌మా అని.. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా భార‌తీయుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు.. గౌర‌వం క‌లుగుతోంది. తాజాగా ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా సైతం ఇండియ‌న్స్‌ ను ప్ర‌త్యేకంగా చూసేందుకు ఓకే చేసింది.

త‌న తాజా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని సాధించారు. అమెరికాకు వెళ్లే భార‌తీయుల‌కు ఇక‌పై రాయ‌ల్ ఎంట్రీ ల‌భించ‌నుంది. అయితే.. ముందస్తుగా అనుమ‌తి పొందిన వారికే ఈ స‌రికొత్త ప్రివిలేజ్‌ ను ఎంజాయ్ చేసే వీలుంది.

అమెరికా విమానాశ్రయాల్లో పెద్ద‌గా త‌నిఖీలు లేకుండా.. ఆ దేశంలోకి చాలా సులువుగా వెళ్లేందుకు వీలుగా ఇండియ‌న్స్‌ కు ప్ర‌త్యేక ప్ర‌వేశాన్ని క‌ల్పించేందుకు ఓకే చేశారు. గ్లోబ‌ల్ ఎంట్రీ ప్రోగ్రామ్ పేరుతో అమెరికా క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్స్ ప్రొటెక్ష‌న్ విభాగం అమెరికా ఎయిర్ పోర్ట్ ల‌లో త‌నిఖీలు అట్టే అవ‌స‌రం లేని రీతిలో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ కొలంబియా.. యూకే.. జ‌ర్మ‌నీ.. ప‌నామా.. సింగ‌పూర్.. ద‌క్షిణ కొరియా.. స్విట్జ‌ర్లాండ్‌.. మెక్సికో దేశాల‌కు మాత్రం ఈ కార్య‌క్ర‌మం కింద ప్రివిలేజ్ ఎంట్రీ ల‌భించేది. ఇప్పుడీ దేశాల స‌ర‌స‌న భార‌త్ కూడా చేరింది. దీని కార‌ణంగా అమెరికాకు వెళ్లే భార‌తీయులు ఎంపిక చేసిన విమానాశ్ర‌యాల్లో దిగిన‌ప్పుడు వారిని మిగిలిన ప్ర‌యాణికుల మాదిరి త‌నిఖీ చేయ‌రు. చాంతాడంత క్యూ లైన్ల‌లో గంట‌ల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ప్ర‌శ్న‌లు ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఎంపిక చేసిన దేశ‌స్తుల కోసం ఏర్పాటు చేసిన ఆటోమేటిక్  గ్లోబ‌ల్ ఎంట్రీ కియోస్క్ లు ఉంటాయి. వీటి ద్వారా బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. తాజా వెసులుబాటు భార‌తీయులంద‌రికి ల‌భించ‌నుంది. కాకుంటే.. ఈ ప‌థ‌కాన్ని అమలు కావాలంటే ముందుస్తుగా అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.  ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. యూఎస్ వీసా అధికారులు స‌ద‌రు వ్య‌క్తి నేప‌థ్యాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి.. వ్య‌క్తిగ‌తంగా ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి వారితో ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చుకున్నాక‌.. వారికి ప్రివిలైజ్ అందిస్తారు. ఏమైనా.. ఇలాంటిది భార‌తీయుల‌కు ల‌భించేలా చేసినందుకు మోడీని మెచ్చుకోక త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News