జైల్లో ర‌చ్చ ర‌చ్చ చేసిన వీఐపీ నిందితురాలు

Update: 2017-06-26 12:54 GMT
త‌న క‌న్న కూతురు షీనాబోరాను హ‌త్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఇంద్రాణీ ముఖ‌ర్జీ తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ప్ర‌స్తుతం బైక‌ల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖ‌ర్జియా జైలులో అల్ల‌ర్లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మంటూ మ‌రో కేసులో పోలీసులు బుక్ చేశారు. జైలులో ఉన్న  ఖైదీ మంజూల శెట్టి గ‌త శుక్ర‌వారం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. అయితే.. జైలులోని స్టాఫ్ మంజూల‌ను తీవ్రంగా కొట్ట‌డం వ‌ల్లే మ‌ర‌ణించింద‌ని ఆరోపిస్తూ జైలులో మిగతా 200 మంది ఖైదీల‌తో ఇంద్రాణి నిర‌స‌న చేప‌ట్టింది.

ఈ నిర‌స‌న సంద‌ర్భంగా జైలులో ఖైదీల‌తో జైలులోని కాగితాల‌కు నిప్పు పెట్ట‌డంతో పాటు వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు.  తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. ఇలా నిర‌స‌న చేప‌ట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టిన పోలీసులు ఇంద్రాణితో స‌హా 200 మంది ఖైదీల‌ను ఈ కేసులో బుక్ చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంద్రాణితో పాటు మరో 200 మంది ఖైదీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మ‌రోవైపు మహిళా ఖైదీ మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 24 ఏళ్ల షీనాబోరా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలుగా ఉన్న‌ ఇంద్రాణి ముఖర్జియా ప్ర‌స్తుతం జైలు జీవితం గ‌డుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News