కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇప్పుడు ఇలా జైల్లో పడడానికి ప్రధాన కారణం ఇంద్రాణి ముఖర్జీ. చిదంబరంపై మోపిన ‘ఐఎన్ ఎక్స్’ మీడియాకు ఈమె ఒకప్పుడు ప్రమోటర్. ఈమె అప్రూవర్ గా మారి చిదంబరంను పట్టించింది. అయితే చిదంబరానికి - ఆయన కుమారుడు కార్తికి నమ్మినబంటుగా మారి వేల కోట్ల అక్రమాల్లో పాలుపంచుకున్న ఈమె చిదంబరంపై ఇప్పుడు హాట్ కామెంట్ చేశారు.
తాజాగా ఇంద్రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. చిదంబరంను అరెస్ట్ చేయడం శుభపరిణామని సంచలన కామెంట్ చేశారు. ఆయన కుమారుడు కార్తి చిదంబరం బెయిల్ ను కూడా రద్దు చేసి విచారిస్తే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొంది.
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఇరుకున్న ఈమె తన కన్న కూతురు పేరుపై ఈ ఆస్తినంత రాసింది. కేసు బయటపడడంతో తనను తాను కాపాడుకునేందుకే కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కూతురి హత్య - ఐఎన్ ఎక్స్ మీడియా కేసుల్లో ఇంద్రాణి ముఖర్జీ - ఆమె భర్త అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలయ్యారు.
తాజాగా కోర్టు ట్రయల్స్ లో భాగంగా సెషన్స్ కోర్టుకు హాజరై చిదంబరంపై తన కోపాన్ని ప్రదర్శించారు. ఆయన వల్లే తనకు ఈ దుస్థితి పట్టిందని.. ఆయనను వదలద్దంటూ హాట్ కామెంట్ చేశారు. తమ ఐఎన్ ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల అనుమతి కోసం చిదంబరం, కార్తి చిదంబరంలు విదేశాల్లోని వారి సంస్థలకు లంచాలు ఇవ్వాలని కోరినట్లు ఇంద్రాణి చెప్పుకొచ్చారు.అదే ఇప్పుడు వారిని కేసులతో వెంటాడి జైలుకు పంపేలా చేసిందని ఆరోపించారు.