ఇంద్రాణి ముఖర్జీ చేసిన ఆరోపణ నిజమైంది. తనపై జైలు సిబ్బంది దాడి చేశారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వైనం నిజమేనని తాజాగా వైద్యులు ఇచ్చిన నివేదిక వెల్లడించింది. కర్ర లాంటి ఆయుధంతో ఆమెపై బలంగా దాడి జరిగిందని డాక్టర్లు తేల్చారు. ఆమె చేతి మీదా.. శరీరం మీద దెబ్బలున్న విషయాన్ని నిర్దారించింది.
ఇదంతా విన్నప్పుడు అయ్యో అనిపించకమానదు. జైలు సిబ్బంది పాశవికంగా దాడి చేసిన వైనం విన్నప్పుడు ఎలాంటి వ్యక్తికి ఎలాంటి కష్టం వచ్చిందే అన్న భావన కలగటం ఖాయం. మీడియాలో శక్తివంతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సతీమణి కాలక్రమంలో జైలుకు వెళ్లాల్సి రావటం ఎవరూ ఊహించలేరు. ఇలాంటివి రీల్ లైఫ్ లోనే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ.. ఇంద్రాణి ముఖర్జీ ఎపిసోడ్ మాత్రం.. రియల్ లైఫ్ లోనూ ఇలాంటివి తప్పవన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.
జైల్లో జరిగిన ఒక దారుణాన్ని ప్రశ్నించినందుకు ఆమెకు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.నేరం చేసిన సెలబ్రిటీ జైల్లో ఉన్నప్పటికీ.. తన కళ్ల ముందు జరుగుతున్న తప్పును నిలదీయటం.. అందుకు ప్రతిగా తీవ్ర దాడికి గురి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబయి నడిబొడ్డున ఉండే బైకుల్లా జైల్లో ఉన్న ఇంద్రాణి తన తోటి ఖైదీ మరణించిన వైనంపై గళం విప్పారు. జైలుసిబ్బంది ఆరాచకత్వంతో ఆమె మరణం చోటు చేసుకోవటంపై జైల్లో ఆందోళనను చేపట్టారు.
ఇదే సమయంలో ఖైదీ మంజుపై దారుణమైన లైంగిదాడి జరిగిందన్న విషయాన్ని వైద్యులు ప్రకటించారు. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సహ ఖైదీ మరణంపై ఇంద్రాణి చేస్తున్న ఆందోళనపై జైలు సిబ్బంది కన్నెర్ర చేశారు. ఇదే సమయంలో తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించారు.
సహ ఖైదీని ఏ తీరులో అయితే లైంగికంగా దాడి చేశారో అదే రీతిలో తనపైనా దాడి చేస్తామని హెచ్చరించారని ఆమె చెప్పారు. సహ ఖైదీ మంజు ప్రైవేట్ పార్ట్ లోకి లాఠీని దూర్చి హింసించారో.. అలాంటి అనుభమే తనకూ ఎదురవుతుందంటూ జైలుసిబ్బంది చేసిన హెచ్చరికను ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆమెను కోర్టుకు హాజరు పర్చాలంటూ అధికారులకు ఆదేశాలు అందాయి.
కోర్టు విచారణలో జైల్లో జరిగిన దారుణ ఘటనలపై ఆమె నోరు విప్పారు. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలనిపేర్కొన్నారు. దీంతో ఇంద్రాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆమె ఆరోపించినట్లే.. ఆమెపై జైలుసిబ్బంది దాడికి పాల్పడ్డారంటూ తాజాగా విడుదలైన వైద్యుల నివేదిక వెల్లడించింది. ఒక సెలబ్రిటీని జైల్లో అత్యంత దారుణంగా.. నిబంధనలకు విరుద్ధంగా కొట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/