దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కసాయి తల్లి ఇంద్రాణిని పోలీసులు ఆమె సొంత ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం ఆమెను పోలీసులు వర్లీలోని ఆమె నివాసంలో విచారించారు. వాస్తవానికి శనివారమే ఆమె కస్టడీ ముగిసింది. అయితే కోర్టులో ఆమె విచారణకు అస్సలు సహకరించడం లేదని పోలీసులు చెప్పడంతో వారి విజ్ఞప్తి మేరకు ఇంద్రాణి కస్టడీని కోర్టు సోమవారం వరకు పోడిగించింది. మరో రోజులో ఆమె కస్టడీ ముగుస్తుందనగా పోలీసులు ఆమెను సొంత ఇంటికి తీసుకువెళ్లి విచారించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఆమెను విచారిస్తున్న ఖర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆమెతో పాటు మరో ఇద్దరి వ్యక్తులను కూడా వర్లీ నివాసంలో నాలుగో అంతుస్తులోకి తీసుకువెళ్లి ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. షీనాను ఎలా హత్య చేసింది...చంపేశాక ఎక్కడ దాచి పెట్టిందో ఆ ప్రాంతాలను కూడా చూపించమని పోలీసులు ఇంద్రాణిని అడిగారని తెలుస్తోంది. షీనాను హత్య చేసే ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించారట. షీనాను వర్లీకి తీసుకురావడంతో అక్కడున్న వారంతా ఆమెను పదే పదే చూస్తుండడంతో ఆమె తలవంచుకుని సైలెంట్ అయిపోయింది. విచారణ అనంతరం ఆమెను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.