నందిగామలో ఇండస్ట్రియల్ పార్కు

Update: 2015-08-20 13:54 GMT
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏపీఐఐసీ ఏర్పాటు చేయనుంది. దీని ఏర్పాటుకు పెద్దవరం గ్రామంలో 1100 ఎకరాలను గుర్తించింది. కొండ పోరంబోకు భూములను రెవెన్యూ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు మొదలు పెట్టింది.

భూములను స్వాధీనం చేసుకున్న వెంటనే గతానికి భిన్నంగా ఆ భూమిని ప్లాట్లు చేయాలని ఏపీఐఐసీ భావిస్తోంది. రోడ్లు, మంచినీటి పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలుగా మాస్టర్ ప్లాన్ తయారీలో ఉంది. అనంతరం ఈ భూముల్లో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా దీనిని లీజుకు ఇస్తుంది. ఒక్కో పరిశ్రమలోనూ పాతిక నుంచి యాభై మంది వరకు ఉపాధిని కల్పిస్తారు. మొత్తం భూమిలో ఎన్ని వేల గజాలు అందుబాటులోకి వస్తుందో గుర్తించి.. దానికి అనుగుణంగా పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. పరిశ్రమల పెట్టుబడి, ఉపాధి సామర్థ్యాన్ని బట్టి ఎంత స్థలం ఇవ్వాలో నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను బట్టి పరిశ్రమలకు ఇచ్చే భూములకు ధర నిర్ణయిస్తారు.
Tags:    

Similar News