డిజిటల్ సర్వీసుల ప్రదాతగా భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ నివేదికలో ఇన్ఫోసిస్ అత్యద్భుత బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీగా చోటు సంపాదించుకుంది. దాదాపు 120 అమెరికన్ సంస్థల్లోని ఐటీ లీడర్లతో చేసిన సర్వేలో ఇన్పోసిస్ కి ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ సర్వీసుల వ్యూహం కేటగిరీలో అత్యున్నత బ్రాండ్ విలువను చేజిక్కించుకుంది.
డిజిటల్ సాధికారత - డిజిటల్ సామర్థ్యం - డిజిటల్ వృద్ధి వంటి అంశాలపై డిజిటల్ పెట్టుబడులు పెట్టడంపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయని ఎవరెస్టు గ్రూప్ ఉపాధ్యక్షుడు చిరజిత్ సేన్ గుప్తా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ డిజిటల్ ప్రక్రియలను మరిత సరళీకృతం చేయనుంది. ఇందులో భాగంగా సాంకేతిక అంశాలతో పాటు ఉత్పత్తి, నాణ్యతలను మరింత మెరుగుపర్చడంపై ఇన్ఫోసిస్ దృష్టి సారించిందని, వ్యాపార ప్రక్రియ భాగస్వాములందరికీ అత్యున్నత అనుభవశాలిగా అది సేవలను అందిస్తోందని సేన్ గుప్తా వివరించారు.
ఇది ఉత్తర అమెరికా వాణిజ్య సంస్థల డిజిటల్ వ్యూహంలో ఇన్ఫోసిస్ ను అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా చేసిందని గుర్తు చేశారు. కొత్తకొత్తగా పుట్టుకొస్తున్న వాణిజ్య నమూనాలను మెరుగు పర్చడం, వినియోగదార్లకు మెరుగైన సేవలందించడం, వ్యాపార నిర్వహణా సామర్థ్యాలను పెంపొందించుకోవడం - సలహాలు - సంప్రదింపులు - సరికొత్త ఆవిష్కరణలను అందజేయడంపై ఇన్ఫోసిస్ ముందడుగులో ఉందని వ్యాఖ్యానించారు.