అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ కు ఏమైనా లింకు ఉంటుందా? అంటే.. ఉండదని చప్పున చెబుతాం. కానీ.. సంబంధం లేకపోలేదు. బ్రస్సెల్స్ నగరాన్ని వణికించిన ఉగ్రదాడిలో మనోడు ఒకడు మిస్ కావటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. బ్రస్సెల్స్ లో పేలుళ్లు చోటు చేసుకోవటానికి గంట ముందు తన తల్లితో మాట్లాడిన రాఘవేంద్ర ఆచూకీ ఇప్పుడు తెలియటం లేదు.
బ్రస్సెల్స్ నగరంలోని ఇన్ఫోసిస్ లో రాఘవేంద్ర గణేశన్ పని చేస్తున్నారు. పేలుళ్ల అనంతరం అతని ఆచూకీ లభించటం లేదు. అతని జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అలాంటివేమీ ఫలించటం లేదు. అతని మిత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. అవేమీ ఫలించటం లేదు. బ్రస్సెల్స్ పేలుళ్ల బాధితుల్లో మనోళ్లు ఎవరూ లేరని చెప్పినా.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది గాయపడటం.. వారికి మెరుగైన వైద్యం అందేలా కేంద్రం చర్యలు తీసుకుంది.
అయితే.. రాఘవేంద్ర గణేశన్ మిస్ కావటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అతడి ఆచూకీ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవటం అతడి తల్లిదండ్రులు.. బంధువులు.. స్నేహితులు.. తెలిసిన వారంతా విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.