ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిన్ షేర్లు మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డులను అందుకున్నాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.41 లక్షల కోట్లు) దాటింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. అంతేకాదు దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన ఇన్ఫీ, ఈ ఆర్థిక తొలి త్రైమాసికంలో చెప్పుకోదగిన లాభాలు ఆర్జించింది. గతేడాది జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.4,233 కోట్లు కాగా, ఈసారి అది రూ.5,195 కోట్లుగా ఉంది. మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ షేరు ధర గరిష్ఠంగా రూ.1755.60ను తాకడం గమనార్హం.
కంపెనీ స్థిర కరెన్సీలో పూర్తి ఏడాది వృద్ధి అంచనాను పెంచింది. గతంలో ఇది 12 నుంచి 14 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు అది 14 నుంచి 16 శాతంగా అంచనా వేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి షేర్ మార్కెట్ జోరుమీదుంది. ఫిబ్రవరిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 50 వేల మార్క్‌ని దాటితే ఆగస్టులో 56 వేలు క్రాస్ చేసింది. అయితే ఇందులో ఎక్కువగా లాభపడింది ఐటీ కంపెనీలే. దీంతో గత కొంత కాలంగా ఐటీ కంపెనీల ఆస్తుల విలువ పెరుగుతోంది. మంగళవారం మార్కెట్ లో ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ ఒక శాతం పెరగింది. దీంతో ఒక షేర్ విలువ రికార్డు స్థాయిలో రూ.1,755.60కి చేరుకుంది.
దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో రెండవదిగా ఇన్ఫోసిస్ కి గుర్తింపు ఉంది. బ్లూ చిప్ కేటగిరికి చెందిన ఇన్ఫోసిస్ షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజగా ఒక షేర్ వాల్యూ రూ.1,755.60కి పెరిగిపోవడంతో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇండియన్ కరెన్సీలో ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 7.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. డిజిటైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ రంగం జోరుగా ఉంది. కరోనా తదనంతర వ్యాపారాలు ఐటీకి కొత్త రూపు ఇస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు రాణిస్తున్నాయి. భారత ఐటీ స్టాక్స్ ఇటీవలి కాలంలో భారీగా ఎగిశాయి.
ప్రపంచ ఐటీ రంగ షేర్లతో పోలిస్తే మన స్టాక్స్ ఇటీవలి కాలంలో 41.28 శాతం లాభపడ్డాయి. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 5 కంపెనీల విషయానికి వస్తే.... రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నిన్న రూ.2182.80 ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1383773.64 కోట్లుగా ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ నిన్న రూ.3612.20 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1336171.34 కోట్లుగా ఉంది. HDFC బ్యాంకు లిమిటెడ్ స్టాక్ నిన్న రూ.1558.75 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.862319.11 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ స్టాక్ నిన్న రూ.1720.75 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.729919.40 కోట్లుగా ఉంది. హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ స్టాక్ నిన్న రూ.2638.10 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.619845.03 కోట్లుగా ఉంది.
మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేరు సరికొత్త ఏడాది గరిష్ఠం రూ.1,755.6 వద్దకు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంట్రాడేలో 10,078 కోట్ల డాలర్లకు (రూ.7.477 లక్షల కోట్లు) ఎగబాకింది. అయితే, ప్రారంభ లాభాలను కోల్పోయిన ఇన్ఫీ షేరు చివరికి 1.06 శాతం నష్టంతో రూ.1,720.75 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.7.29 లక్షల కోట్లకు పరిమితమైంది.