రాయలసీమకు నీటి పంపకాల విషయం తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) పరిధిలోకి తీసుకొని గెజిట్ అమలుకు అడుగులు వేస్తున్నారని, 3నెలల పాటు మాత్రమే ప్రస్తుత విధానం అమలు జరిగే అవకాశం ఉందని, దీంతో ఏపీ ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరగబోతుందని టీడీపీ నేతలు వాపోతున్నారు. కృష్ణా నదిపై మొత్తం 49 ప్రాజెక్టులు ఉండగా అందులో 15 ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్లిపోయాయని టీడీపీ చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రాయలసీమ వాసిగా సీఎం జగన్ ఏం చేస్తు న్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాయలసీమ నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని టీడీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే నీటి ప్రాజెక్టుల పరిరక్షణకు రాయలసీమ స్థాయిలో పోరాటాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగానే ఆదివారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల విషయంలో ఎలాంటి పోరాటం చేయాలనే దానిపై ప్రతినిధుల నుంచి సూచనలు తీసుకున్నారు. రాయలసీమకు దక్కాల్సిన నీటి వాటాపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మన హక్కులు కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారని విమర్శించారు. సీమ రావాల్సిన నీటి కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని చేపట్టాలని అభిప్రాయపడ్డారు. గతంలో చేపట్టిన గోదావరి -పెన్నా నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమగా పేరుగాంచిందని, ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతోందని బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమ కడగండ్లను చూసిన ఎన్‌టీఆర్.. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవాకు ఆయన శ్రీకారం చుట్టారని బాలకృష్ణ గుర్తుచేశారు.హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 2014 నుంచి 2019 టీడీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఖర్చు పెట్టారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కృషితో జిల్లాకు కృష్ణా జలాలు తీసుకువచ్చారని తెలిపారు. హంద్రీ నీవాతో జిల్లాల్లో వ్యవసాయం పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ నీవాపై ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని బాలకృష్ణ దుయ్యబట్టారు.
మరోవైపు రాయలసీమకు 120 టీఎంసీలు తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఇప్పటికీ 60 శాతం మాత్రమే నీటిని తీసుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో రాయలసీమ భవిష్యత్తు నాశనం కాబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ రాయలసీమ నేతలతో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలు తీసుకొని భవిష్యత్ పోరాటాలకు టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఉద్య మాలకు అన్ని వర్గాలు అండగా నిలవాలని అప్పుడే ప్రాజెక్టుల పరిరక్షణ సాధ్యమవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ అన్యాయంపై నోరు మెదపాలని లేకపోతే ప్రజలు క్షమించరని టీడీపీ హెచ్చరిస్తోంది.