పురణాలు.. ఇతిహాసాలుగా చెప్పుకునే రామాయణం.. మహాభారతం లాంటివేమీ కల్పిత కథలు కావని.. నిజాలేనని.. అందులో పేర్కొన్నట్లు అన్నీ జరిగాయని చెప్పటమే కాదు.. వాటి తేదీలను సైతం వెల్లడిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. తాజాగా ఈ సంస్థ రూపొందించిన నివేదిక పట్ల పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఇంతకాలం పురాణ కాలంలో జరిగిన అంశాలుగా చెబుతున్న వాటిల్లోని అసలు నిజాలు బయటకు తీసినట్లుగా చెబుతున్నారు. తాజా నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం రాముడు ఎప్పుడు పుట్టాడు.. అశోకవనంలో సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడు.. మహాభారతలోని కురుక్షేత్ర సమరం ఏ రోజు షురూ అయ్యింది లాంటి అంశాలకు సంబంధించి సంవత్సరం.. తేదీ.. సమయంలో సహా చెప్పేస్తున్నారు.
ఉదాహరణకు రాముడు ఎప్పుడు పుట్టాడన్న ప్రశ్నకు తాజా నివేదిక ఇస్తున్న సమాధానం ‘‘క్రీస్తు పూర్వం 5114 జనవరి 10 అర్థరాత్రి 12.05 గంటలుగా తేల్చారు. ఇక.. అశోకవనంలో (రావణుడు ఎత్తికెళ్లిన తర్వాత) ఉన్న సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడన్న దాన్ని కూడా డేట్ వచ్చేసింది. క్రీస్తు పూర్వం 5076 సెప్టెంబరు 12గా తేల్చారు. ఇక కురుక్షేత్ర సంగ్రామం క్రీస్తు పూర్వం 3139 అక్టోబర్ 13గా నిర్దారించారు.
రుగ్వేద.. రామాయణ.. మహాభారత కాలాలను గ్రహాల ఆధారంగా చేసుకొని కచ్ఛితంగా చెప్పొచ్చని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సరోజ్ చెబుతూ.. ఇలా తేదీలు నిర్దరించటానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ వినియోగించనున్నట్లు చెప్పొచ్చు. పైన పేర్కొన్న కొన్ని అంశాలే కాక.. పలు అంశాలకు సంబంధించిన తేదీల్ని తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇంతకాలం రామాయణ.. మహాభారతల్ని పుక్కిట పురాణాలుగా అభివర్ణించిన వారంతా ఇప్పుడు తమ వాదనకు పదును పెట్టాల్సిన అవసరం ఎర్పడినట్లే.
ఇంతకాలం కథలుగా అనుకున్న రామాయణ.. మహాభారతాలు నిజమని చెప్పటమే కాదు.. ఈ అంశాలన్నింటిపై ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేయాలని ఆదేశించినట్లు కేంద్ర సహాయ మంత్రి మహేష్ శర్మ చెబుతున్నారు. మొత్తంగా రామాయణ.. మహాభారతాలు నిజమని వాదించే వారికి కొత్త శక్తి వచ్చినట్లే.