ఏపీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయాన్ని నిఘా విభాగం తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఆయన ప్రాణాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ రాష్ట్ర నిఘా వర్గం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏపీ ముఖ్యమంత్రికి ఉగ్రదాడి ముప్పు ఉందని.. ఆయనకు మెట్రో ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
ఎయిర్ పోర్ట్ నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ కారులోనే చంద్రబాబును తీసుకురావాలే తప్పించి.. మెట్రో రైల్ ప్రయాణం సరికాదన్న విషయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు రాష్ట్ర నిఘా వర్గం స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఉగ్రవాదులు.. మత చాందసవాదులు.. ఎర్రచందనం.. స్మగ్లర్లతో ముప్పు ఉందన్న నిఘా వర్గం ఆయనకు మెట్రో రైల్ జర్నీ ఏ మాత్రం మంచిది కాదని.. ఆయన ప్రాణాలకు ముప్పుగా మారుతుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో.. ఢిల్లీ మెట్రోలో చంద్రబాబు ప్రయాణించే అవకాశం ఇక ఏ మాత్రం ఉండదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఏపీ విపక్ష నేత జగన్ ఢిల్లీ మెట్రో రైల్ లో ప్రయాణించారు. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీలతో కలిసి ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించి.. అనంతరం కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు.