తెలంగాణ లో ఈ ఏడాది ఇంటర్ బోర్డు లో జరిగిన అవకతవకల గురించి అందరికి తెలిసిందే. లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ తో ఇంటర్ బోర్డ్ అధికారులు ఆటలాడారు. ఫలితాల విడుదల లేటు అవుతుందనే కారణంతో సరిగ్గా మూల్యాంకనం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఫలితాలని విడుదల చేసింది. దీనితో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తమకి టాప్ మార్కులు వస్తాయి అనుకుంటే ..ఫెయిల్ అయ్యామనే కారణంతో కొంతమంది ఆత్మహత్యలకి కూడా పాల్పడ్డారు. దీనిపై కోర్టు , ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఆ తరువాత బోర్డు జరిగిన తప్పులని సరిదిద్దుకుంది కానీ , పోయిన ప్రాణాలని మాత్రం తీసుకురాలేదు కదా .. అలాగే ఒకవైపు ఎంసెట్ కౌన్సిలింగ్ మరోవైపు ..ఫలితాల విడుదల లో గందరగోళం జరగడటం తో చాలామంది విద్యార్థులు మానసిక క్షోభ అనుభవించారు.
దీనిపై తాజాగా ఇంటర్ బోర్డు పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ , మరోసారి అలాంటి తప్పులు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా ఇంటర్ బోర్డు పేపర్ లెస్ విధానాన్ని తీసుకువచ్చింది. శుక్రవారం నుంచి ఇంటర్ బోర్డు పూర్తిగా పేపర్ లెస్ ఆఫీస్‌గా మారింది. వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే అఫిలియేషన్‌ను ఈ ఏడాది చివర్లోనే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ రూపొందించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో వివిధ మేనేజ్మెంట్ల పరిధిలో 2,558 జూనియర్ కాలేజీలుండగా, వాటిలో 10 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కాలేజీలను పర్యవేక్షించేందుకు ఇంటర్ కమిషనరేట్, ఇంటర్ బోర్డుతోపాటు వరంగల్ కేంద్రంగా రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ కొనసాగుతోంది. జిల్లాల్లో డీఐఈఓ, నోడల్ ఆఫీసులున్నాయి. వీటన్నింటిలో ఇప్పటి వరకూ ఆర్డర్స్, వర్క్ అంతా పేపర్‌పైనే సాగుతోంది. దీనితో శుక్రవారం నుంచి పూర్తిగా పేపర్ లెస్ ఆఫీస్‌గా ఇంటర్ బోర్డును మార్చేశారు.
అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ ఓ సమస్యగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత, అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినా అధికారికంగా కాలేజీలకు అఫిలియేషన్‌ను అధికారులు ఖరారు చేయడం లేదు. రూల్స్ ప్రకారం కాలేజీలు లేకున్నా, స్టూడెంట్ల భవిష్యత్ కోసం అంటూ షరతులతో అనుమతులు ఇస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేసారు. ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ మాదిరిగానే జూనియర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియను నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లోనే అఫిలియేషన్ నోటిఫికేషన్ ఇచ్చి, మార్చి నాటికి ప్రాసెస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థులు ప్రత్యేకంగా ఫిర్యాదులు చేయడానికి ఒక వెబ్ సైట్ ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.