నిజమా.... అనుకుంటున్నారా...నిజమే అనుకుంటున్నారా... తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటి పోరు ఇంతింతి కాదయా అన్నట్లు పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర భవన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటి పోరు మాట నిజమేనని కొందరు... అబ్బే అలాంటిదేం లేదు అని మరికొందరు వాదులాడుకుంటున్నారని సమాచారం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర భవన్ కు వెళ్లిన వారికి ఇలాంటి వాదప్రతివాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇంటి పోరు ఏమిటా అని కొందరు నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట కూడా. అబ్బే అదేం లేదని కొందరు నాయకులు కొట్టి పడేస్తున్నా విషయం మాత్రం ఏదో ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ ఇంటి పోరు ఇప్పది కాదని - దాదాపు సంవత్సరం ముందు నుంచి నలుగుతోందని అనే వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఢిల్లీ వెళ్లి జాతీయ రాజకీయాలను శాసించాలని ఇంట్లో ఓ వర్గం చెప్పిందని సమాచారం. దీనిపై పార్టీలో ముఖ్యులతో మాట్లాడిన కల్వకుంట్ల వారు ఇందుకు సమ్మతించి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం బెంగళూరు - చెన్నై - కోల్ కతా - భువనేశ్వర్ - ఢిల్లీల్లో పర్యటించారు. అక్కడి నాయకులను కూడా కలుసుకుని థర్డ్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారు. అయితే ఇవన్నీ ఓ పక్క జరుగుతూండగా మరోవైపు తాను ఢిల్లీ వెళ్తే ఇక్కడ పార్టీ - ప్రభుత్వం ఎవరి పాలవుతుందని సీనియర్లు ప్రశ్నించారని సమాచారం. దీనికి సమాధానం మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పలేదట. అందరూ హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని భావించారట.అయితే చివరి నిమిషంలో కేసీఆర్ కుమారుడు తారక రామారావు తెరపైకి వచ్చారని అంటున్నారు.
ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన కె.చంద్రశేఖర రావు పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహించి తన మనసులో మాటను బయటపెట్టారని సమాచారం. అయితే ఇతర నాయకులు... ముఖ్యంగా హరీష్ రావుతో పోలిస్తే తారక రామారావుకు దూకుడు ఎక్కువని - పైగా సీనియర్ల పట్ల కనీస గౌరవాన్ని కూడా చూపడని వారంతా అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తన కుమారుడికి నచ్చ చెప్పే పని ప్రారంభించారట. పార్టీ పగ్గాలు ఒకరికి - ప్రభుత్వ పగ్గాలు మరొకరికి అని కూడా వాటాలు వేయాలనుకున్నట్లు కూడా ప్రతిపాదన వచ్చిందట. అయితే దీనికి తారక రామారావు నుంచి - ఆయన వర్గీయుల నుంచి వ్యతిరేకత వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ముగిసే వరకూ ఎవరూ ఏం మాట్లాడవద్దని - ఎన్నికల అనంతరం అప్పటి పరిణామాలను బట్టి ఏదో ఒకటి చేద్దామని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇంటి పోరు కారణంగానే ఎప్పుడు ఏదో సంచలన ప్రకటనతో వార్తల్లో ఉండే కల్వకుంట్ల చంద్రశేఖర రావు గడచిన నెల రోజులుగా కిమ్మనకుండా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలంగాణ భవన్ లో వాపోతున్నారని సమాచారం.