టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ను పెట్టుబడిదారులు నమ్మడం లేదని తెలుస్తోంది. రవి ప్రకాష్ ఒక న్యూస్ చానల్ ను నడిపించే శక్తియుక్తులు ఉండవచ్చు. అయితే ఆయన టీవీ నైన్ లో తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం - అందుకు సంబంధించి కేసులను ఎదుర్కొంటూ ఉండటం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో రవి ప్రకాష్ ను కొత్తగా ఇన్వెస్టర్లు నమ్మడం లేదని తెలుస్తోంది.
టీవీ నైన్ నుంచి పూర్తిగా తొలగింపబడ్డాకా రవి ప్రకాష్ కొత్త చానల్ పెట్టడానికి పలు ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. అయితే అవేవీ ఫలప్రదం కావడం లేదట. తన ఐడియాలను ఎంతమందికి చెప్పినా వారు పట్టించుకోవడం లేదని వినికిడి. రవి ప్రకాష్ లాంటి సక్సెస్ ఫుల్ జర్నలిస్టుకు ఇలాంటి పరిస్థితి రావడం ఆయన తీరే అని టాక్.
టీవీ నైన్ అంటే రవి ప్రకాష్ - రవి ప్రకాష్ అంటే టీవీ నైన్ అనే పరిస్థితి ఉండేది. అలాంటిది ఆ సంస్థకు రవి ప్రకాష్ తీవ్రమైన ద్రోహం చేశారనే అభిప్రాయాలు ఆఖర్లో వ్యక్తం అయ్యాయి. ఆ సంస్థ యాజమాన్యాన్నే రవి ప్రకాష్ చాలెంజ్ చేశాడు. తన చేతిలో కొద్ది మేర మాత్రమే షేర్ పెట్టుకుని వారిని ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేశాడు.
వారు చానల్ ను అమ్ముకోవాలనుకున్నప్పుడు వారికి స్వతంత్రం లేదన్నట్టుగా - తను చెప్పిన వారికే దాన్ని అమ్మాలి అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఇక లోలోన టీవీ నైన్ వాటాలకు సంబంధించి వివాదం రేపడం - అలాగే ఆ చానల్ లోగోను చిల్లర ధరకు అమ్ముకోవడం.. వంటి వివాదాలు కూడా రేపాడాయన. ఇలాంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తిని - కన్నతల్లి లాంటి సంస్థకు అలాంటి ద్రోహం చేశారనే కేసుల నేపథ్యంలో మళ్లీ రవి ప్రకాష్ ను ఎవరైనా నమ్మే అవకాశాలు ఉంటాయా? అనేది ఎవరికైనా ఇట్టే అర్థం అయ్యే అంశం.
అందుకే ఇప్పుడు రవిప్రకాష్ కు కొత్తగా ఇన్వెస్టర్లు రావడం లేదని, ఆయనను నమ్మి పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అయినా ద్రోహం చేయడనే గ్యారెంటీ లేదని.. అందుకే ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉందని సమాచారం!