ఐపీఎల్ః బీసీసీఐకి అంత నష్టమా?

Update: 2021-05-05 08:33 GMT
అనుమాన‌మే నిజ‌మైంది. దేశంలో కొవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న వేళ‌.. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై చాలా మంది సందేహం వ్య‌క్తంచేశారు. ఈ క‌ఠిన ప‌రిస్థితుల్లో టోర్నీ స‌జావుగా సాగుతుందా? అనే డౌట్లు వ్య‌క్త‌మ‌య్యాయి. అనుకున్న‌ట్టుగానే టోర్నీ అర్ధంతరంగా ఆగిపోయింది. బ‌యో బ‌బూల్స్ ను ఛేదించి మ‌రీ.. ఆట‌గాళ్ల‌ను క‌రోనా ట‌చ్ చేయ‌డంతో ఉన్న‌ట్టుండి నిలిపేయాల్సి వ‌చ్చింది.

అయితే.. ఐపీఎల్ ఆగిపోవ‌డం వ‌ల్ల బీసీసీఐకి వ‌చ్చే న‌ష్టం ఎంత అనే చ‌ర్చ జ‌రుగుతోంది. క్రికెట్ ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన లీగ్ గా కొన‌సాగుతోంది ఐపీఎల్‌. ఈ టోర్నీకి గ‌తేడాదే క‌రోనా గండం వ‌చ్చిప‌డింది. అయిన‌ప్ప‌టికీ.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయిన బీసీసీఐ వేదిక‌ను యూఏఈకి మార్చింది. ఖ‌ర్చు కాస్త ఎక్కువైన‌ప్ప‌టికీ.. స‌క్సెస్ ఫుల్ గా టోర్నీ ముగించింది. మంచి లాభాల‌ను జేబులో వేసుకుంది.

అయితే.. మొద‌టి ద‌శ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. పైగా ఇంగ్లాడ్ తో ద్వైపాక్షిక సిరీస్ ను కూడా ఇండియాలో నిర్వ‌హించ‌డంతో.. దేశంలోనే ఐపీఎల్ ను నిర్వ‌హించ‌డానికి డిసైడ్ అయ్యింది. వేదిక‌ల‌ను త‌గ్గించి, స్టేడియాల్లోకి ప్రేక్ష‌కుల‌ను నిరాక‌రించి, బ‌యోబ‌బూల్స్ తో మైదానాన్ని నింపి టాస్ వేసింది. ఇక‌, ఎదురే లేకుండా టోర్నీ సాగుతుంద‌ని భావించింది.

కానీ, విజృంభించిన సెకండ్ వేవ్.. ఆట‌గాళ్ల‌ను కూడా తాక‌డంతో ఐపీఎల్ ను అనివార్యంగా నిలిపేయాల్సి వ‌చ్చింది. స‌హ‌జంగా ప్ర‌తీ సీజ‌న్ ద్వారా.. బీసీసీఐకి ఐదారు వేల కోట్ల‌ లాభం వ‌స్తుంది. కానీ.. ఇప్పుడు టోర్నీని మ‌ధ్య‌లో ఆపేయ‌డం వ‌ల్ల దాదాపు స‌గం ఆదాయాన్ని కోల్పోతుంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతానికైతే టోర్నీని వాయిదా వేశారు. ర‌ద్దు చేయ‌లేదు. మ‌రి, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత మ‌ళ్లీ నిర్వ‌హిస్తారా? అన్న‌ది చూడాలి. టోర్నీ కొన‌సాగితే.. కొంత ఆదాయం స‌మ‌కూరుతుంది. కాబ‌ట్టి.. ఎంత లేద‌న్నా.. 500 నుంచి వెయ్యి కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంద‌ని అంచ‌నా.
Tags:    

Similar News