ఐపీఎల్ వాయిదా.. నిరాశ‌లో దిగ్గ‌జం కొడుకు?

Update: 2021-05-06 11:30 GMT
ఐపీఎల్ ఆగిపోయినందుకు ఆట‌గాళ్లంతా నిస్సందేహంగా హ్యాపీగానే ఉండిఉంటారు. ప‌లువురు స‌హ‌చ‌రుల‌కు వైర‌స్ సోకిన నేప‌థ్యంలో.. ఎప్పుడెప్పుడు టోర్నీ ముగిస్తారా? అని ఎదురు చూసి ఉంటారు. అయితే.. ఐపీఎల్ వాయిదా ప‌డ‌డం ప‌ట్ల‌ ఒక్క‌రు మాత్రం నిరాశ‌గా ఉండే ఛాన్స్ ఉంది. అత‌నే అర్జున్ టెండూల్క‌ర్‌!

గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అత‌గాడు గోల్డెన్‌ బ్యాట్ తో క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది. జాతీయ జ‌ట్టులోకి కూడా ఎంట్రీ పాస్ ఇప్పించే ప‌రిచ‌యాలు తండ్రి సొంతం. ఇలా.. ఎన్నో అవ‌కాశాలు అత‌డి చుట్టూ ఉన్నాయి. కానీ.. నిరూపించుకోవ‌డానికి కావాల్సిన ఆట‌తీరే అత‌ని నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అలాగ‌ని.. మ‌రీ తీసిపారేయ‌డానికి లేదు. త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు.

ఆ మ‌ధ్య ఓసారి త‌గిన పెర్ఫార్మెన్స్ ఇవ్వ‌కున్నా.. రంజీ ట్రోపీకి సెల‌క్ట్ చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఐపీఎల్ లోకి కూడా తీసుకోవ‌డంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. తండ్రి అండ ద్వారానే ఈ అవ‌కాశాలు వ‌చ్చాయి త‌ప్ప‌, ప్ర‌తిభ‌తో కాద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

అర్జున్ టెండూల్క‌ర్ ను ఆస్థాన జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ 20 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు తీసుకుంది. దీంతో.. త‌న‌ను తాను ఎలాగైనా నిరూపించుకోవాల‌ని అర్జున్ భావించి ఉంటాడు. త‌ద్వారా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని అనుకొని ఉంటాడు. కానీ.. అత‌డికి అవ‌కాశ‌మే రాలేదు.

ముంబై ప్లే ఆఫ్ చేరుకున్న త‌ర్వాత మిగిలిన లీగ్ మ్యాచ్ ల్లో అర్జున్ కు అవ‌కాశం ఇచ్చి ఉండేదేమో. కానీ.. అర్ధంత‌రంగా టోర్నీనే ర‌ద్ద‌యిపోయింది. ఈ ప‌రిస్థితి ఖ‌చ్చితంగా అర్జున్ కు ఆవేద‌న క‌లిగించి ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, అత‌డి ఆశ త‌ర్వాత‌నైనా తీరుతుందేమో చూడాలి.
Tags:    

Similar News