గత సీజన్ లో పెద్దగా రాణించలేకపోయిన ఆర్సీబీ .. ఈ సీజన్ లో మాత్రం దూసుకెళ్తున్నది. తొలి మ్యాచ్‌లోనే ముంబై లాంటి పటిష్ఠమైన జట్టును ఓడించి సత్తా చాటింది. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక కోహ్లీ సరే సరి. గత ఏడాది వివిధ కారణాల వల్ల ఆర్సీబీ దెబ్బతిన్నది. ఈ సారి మాత్రం పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. కోహ్లీ తన ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి జట్టును విజయ పథంలో నడిపిస్తున్నట్టు ఉంది.
నిన్న జరిగిన మ్యాచ్ లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పై .. ఆర్సీబీ విజయం సాధించింది. మ్యాచ్ చివరకంటా ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ విజయం మాత్రం ఆర్సీబీ వశమైంది. చివరి బంతి వరకు ప్రేక్షకులు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. నిన్నటి మ్యాచ్ లో మొదటి 10 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ .. ఆ తర్వాత దెబ్బతిన్నది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (38: 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) పర్వా లేదనిపించాడు. అయితే అతడు అవుట్ అయ్యాక మ్యాచ్ క్రమంగా చేయి దాటింది. 17వ ఓవర్లో సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు సమర్పించుకున్నది.
ఆర్సీబీ కేవలం 150 పరుగులు మాత్రమే చేసినప్పటికీ .. ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా సన్‌రైజర్స్ ఇంత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ సారి ఆర్సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో? లేక అదృష్టం కలిసి వస్తుందో తెలియదు గానీ.. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది.
గత సీజన్ లో మ్యాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్స్ తరఫున ఆడాడు. నిజానికి మ్యాక్స్ అద్భుతమైన ఆటగాడు. కానీ ఎందుకో పంజాబ్ తరఫున సరిగ్గా ఆడలేకపోయాడు. దీంతో అతడిని పంజాబ్ వదులుకున్నది. ఇదిలా ఉంటే ఐపీఎల్ తర్వాత తన దేశానికి ఆడిన మ్యాక్స్ అక్కడ కుమ్మేశాడు. ఆ నమ్మకంతోనే ఆర్సీబీ మ్యాక్స్‌ను కొనుక్కున్నది. ప్రస్తుతం అతడు బాగానే రాణిస్తున్నాడు. ఇక డివిలియర్స్, కోహ్లీ కూడా బాగానే ఆడుతున్నారు. వీళ్లు ముగ్గురు ఫామ్ లో ఉంటే ఆర్సీబీకి తిరుగులేదని అంటున్నారు.