దుబాయ్​ లో మ్యాచ్​ లు.. సురేశ్​ రైనాపై జోకులు..!

Update: 2021-05-30 05:30 GMT
సీఎస్​కే బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా పై సోషల్ మీడియా లో జోకులు పేలుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​ తో ఆగి పోయిన ఐపీఎల్​ మ్యాచులు.. మళ్లీ దుబాయ్​ వేదికగా పునః  ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వాయిదా పడ్డ ఐపీఎల్​ ను యూఏఈలో కొనసాగిస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్​ ఫ్యాన్స్​ ఎగిరి గంతేస్తున్నారు. ఇదిలా ఉంటే దుబాయ్​ లో మ్యాచ్​ లు అనగానే అందరికీ గుర్తొచ్చే ఆటగాడు సురేశ్​ రైనా..

సీఎస్​కే తరఫున ఆడే  రైనా గత ఏడాది దుబాయ్​ పర్యటకు వెళ్లాడు. కానీ అక్కడ అతడికి హోటల్​ రూమ్​ లో బాల్కనీ గది కేటాయించలేదని.. దీంతో సీఎస్​కే యాజమన్యంతో గొడవపెట్టుకొని వచ్చేశాడని వార్తలు వచ్చాయి. తాను వ్యక్తిగత కారణాల వల్ల వచ్చానని రైనా వివరణ ఇచ్చినప్పటికీ ఎవరూ నమ్మలేదు. బాల్కనీ రూమ్​ కేటాయించకపోవడం వల్ల తిరిగి వచ్చేశాడని అందరూ నమ్మారు.

ఇదిలా ఉంటే  ఈ సీజన్​ లో సీఎస్​కే పెద్దగా రాణించలేకపోయింది. ఐపీఎల్​ 2021లో రైనా అద్భుతంగా రాణించాడు. అయితే తాజాగా ఐపీఎల్​ లో మిగిలిన మ్యాచ్​లు దుబాయ్​ లో జరుగుతాయని వార్తలు రావడంతో సీఎస్​కే ఫ్యాన్స్​.. రైనాపై జోకులు పేలుస్తున్నారు. సీఎస్​కే యజమాన్యం ఈ సారైనా .. రైనాకు బాల్కనీ ఉన్న రూమ్​ కేటాయించాలంటూ సోషల్ మీడియాలో మీమ్స్​ పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్​ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​ గా మారాయి.

మరికొందరు హార్డ్​కోర్​ సీఎస్​కే ఫ్యాన్స్​ అయితే యాజమాన్యాన్ని ఏకంగా బెదిరిస్తున్నారు. ఈ సారి రైనా అన్నకు బాల్కనీ రూం కేటాయించకపోయారో? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఈ అంశం ట్రెండింగ్​ మారింది.  ఇంకా 31 ఐపీఎల్​ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్‌ 18 లేదా 19న ప్రారంభించి అక్టోబర్‌ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌ తో ముగించాలనే ఆలోచనతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్​ ఇంకా విడుదల కాలేదు.

ఇదిలా ఉంటే రైనా వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. సీఎస్​కే యాజమాన్యం ఆయనకు కచ్చితంగా బాల్కనీ రూం కేటాయించాలంటూ చాలా మందికామెంట్లు పెడుతున్నారు. గత ఏడాది రైనా వ్యవహారం సీఎస్​కేకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఓ దశలో ఈ అంశంపై సీఎస్​కే చీఫ్​ శ్రీనివాసన్​ మీడియాతో మాట్లాడుతూ.. రైనాకు విజయగర్వం తలకెక్కిందని అన్నాడు. అయితే అనంతరం ఈ వ్యవహారంపై రైనా కూడా వివరణ ఇచ్చుకున్నాడు.

‘ఓ బలమైన కారణంతో నేను దుబాయ్​ నుంచి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. అందరూ అనుకున్నట్టు బాల్కనీ వ్యవహారం, సీఎస్​కేతో విబేధాలు అందుకు కారణం కాదు. సిల్లీ రీజన్​ కోసం 12.5 కోట్లు నేనుందు వదులుకుంటాను’ అంటూ రైనా మీడియాతో అన్నాడు. మరి ఈ సారైనా సీఎస్​కే యాజమాన్యం రైనాకు బాల్కనీ ఉన్న రూం కేటాయిస్తుందా? ఏమో వెయిట్​ అండ్​ సీ.
Tags:    

Similar News