దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఇక శ్మశానాల్లో శవాల క్యూలైన్లో కనిపిస్తున్నాయి. భారత దేశ దుస్థితికి అంతర్జాతీయ సమాజం జాలిపడుతోంది. ఇదిలా ఉంటే మనదేశంలో ఐపీఎల్ కొనసాగుతోంది. ఓ వైపు కరోనాతో ప్రజలు చస్తుంటే ...ఇప్పుడు ఈ గేమ్ అవసరమా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రభుత్వ రాయితీలతో లబ్ధిపొందే పారిశ్రామిక వేత్తలు సైతం కరోనా విపత్తువేళ సాయం ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
విదేశీ క్రికెటర్లు భారీగా విరాళం ప్రకటించారు. పాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ ఇప్పటికే భారత్ కు సాయం ప్రకటించారు. దీంతో స్వదేశీ క్రికెటర్లు విరాళం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా కరోనాకు సాయం ప్రకటించాడు. ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలుకు విరాళం ఇస్తున్నట్టు సచిన్ పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీలు కూడా కరోనా కు సాయం ప్రకటించాయి. రాజస్థాన్ రాయల్స్ 1 మిలియన్ (రూ. 7.5 కోట్లు) విరాళం గా ఇచ్చింది. ఈ మేరకు ఓ రాజస్థాన్ రాయల్స్ ఈ ట్వీట్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ సైతం రూ. 1.5 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. దేశం లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఐపీఎల్ నిర్వహించడం అవసరమా? అంటూ అంతర్జాతీయ మీడియా వరస కథనాలు ప్రచురిస్తున్నది. అయితే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐపీఎల్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. మరోవైపు వెంటనే భారత్ ను విడిచి రావాలంటూ విదేశీ క్రికెటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఐపీఎల్ లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ కు చెందిన విదేశీ క్రికెటర్లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చుతామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
మరోవైపు కొన్ని దేశాలు భారత్తో తాత్కాలికంగా రాకపోకల్ని నిలిపివేశాయి. దీంతో ఆయా దేశాల క్రికెటర్ల లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు కరోనాకు భారతీయ క్రికెటర్లు సాయం చేయకపోవడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ సిలిండర్లు దొరకక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటూ.. రూ. వేల కోట్లు ఖర్చుపెట్టి ఐపీఎల్ నిర్వహించడం అవసరమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.