బిగ్ బ్రేకింగ్ : ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీ !

Update: 2020-06-13 08:10 GMT
ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా  ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్‌ డీజీపీ గా బదిలీ చేసారు. ఆయన స్థానంలో విజయవాడ సీపీగా బీ శ్రీనివాసులు నియమితులు అయ్యారు.

 బదిలీ అయిన అధికారలు వివరాలు  ఇవే :
 ఏడీజీపీ ఆర్గనైజేషన్ ‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం
 రోడ్‌ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా
 ఎస్ ‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ
  గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి
  శ్రీకాకుళం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌
 డీజీపీ ఆఫీస్‌ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌
 విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి
 ఎస్ ‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ
  విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు
 విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్‌.విజయారావు
 పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నారాయణ నాయక్‌
 సీఐడీ ఎస్పీగా నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌
 గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్‌ గున్నీ
 డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు
 'దిశ' ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డీజీపీ కార్యాలయం లో ఏపీఎస్ ‌పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్ ‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో
తెలిపింది.
Tags:    

Similar News