వారెవ్వా.. పట్టుబట్టి 63 కేజీలు తగ్గాడు.. ఫ్యామిలీకి బిగ్ సర్ ప్రైజ్..!

Update: 2022-11-24 23:30 GMT
మనిషి ప్రయత్నించాలే గానీ సాధ్యం కానిదంటూ ఉండదని ఎన్నోసార్లు ఎంతోమంది నిరూపించారు. తాజాగా ఐర్లాండ్ చెందిన ఓ వ్యక్తి ఆరునెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లి ఏకంగా 61 కేజీలు తగ్గాడు. బరువు తగ్గిన తర్వాత ఇంటికి చేరుకొని ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్ లోని కోర్క్ ప్రాంతంలో బ్రయాన్ ఓ కీప్ఫె అనే పాతికేళ్ల కుర్రాడు తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతడిని  చాలా రోజులుగా అతి బరువు సమస్య వెంటాడుతోంది. 2021లో అతని బరువు సుమారు 154 కేజీలు ఉంది. అయితే అతడి ఫ్యామిలీ మెంబర్స్.. స్నేహితులకు అతడి బరువు పెద్ద సమస్యగా అనిపించలేదు.

అయితే బ్రయాన్ మాత్రం తన అతి బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు తాను బరువు పెరగడానికి ఇంటి పుడ్డే కారణమని గ్రహించాడు. ఈక్రమంలోనే ఇంటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. బరువు తగ్గాకే ఇంటిముఖం చూడాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే దాదాపు ఏడు నెలలపాటు ఇంటికి దూరంగా ఉండి అనుకున్నది సాధించాడు. ఈ ఏడు నెలల కాలంలో విరామం లేకుండా వర్కౌట్స్ చేశాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో గాయాలు తగిలినా ఏమాత్రం జడవకుండా పట్టుదలతో ప్రయత్నించాడు. ఒకానొక సమయంలో భారీ కాయంతోనే ఐదు కిలోమీటర్ల దూరాన్ని 35 నిమిషాల్లోనే పూర్తి చేశాడంటే అతని పట్టుదల ఏంటో అర్థమవుతుంది.

ఒకవైపు గంటల తరబడి వ్యాయమాలు చేస్తూనే మరోవైపు డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. అధిక కేలరీలు ఉండే ఫుడ్ కు దూరంగా ఉన్నాడు. ఇలా రోజుకు ఐదు గంటలపాటు వర్కౌట్స్ చేసే స్థాయికి బ్రయాన్ చేరుకున్నాడు. వాకింగ్.. రన్నింగ్.. వెయిట్ లిఫ్టింగ్.. స్విమ్మింగ్  అన్నింటిని ప్రయత్నించాడు.

అతడి శ్రమ ఫలించడంతో ఏకంగా 61 కేజీల బరువు తగ్గాడు. దీంతో అతడి బరువు 150 కేజీల నుంచి 91 కేజీలకు చేరుకుంది. అయితే బ్రయాన్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడే తప్ప వీడియో కాల్స్ గానీ.. వర్కౌట్స్ కు సంబంధించిన విషయాలు గానీ వారికి తెలియజేయలేదు. అంతేకాకుండా తాను ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడే కూడా వారికి చెప్పలేదు.

ఈ నేపథ్యంలో సుమారు ఏడు నెలల తర్వాత బ్రయాన్ తన ఇంటికి చేరుకున్నాడు. స్లిమ్ గా మారిన బ్రయాన్ ను చూసి అతడి ఫ్యామిలీ మెంబర్స్ ఆనందంతో కేరింతలు కొట్టాడు. బ్రయాన్ అతి బరువు తమకు ఎప్పుడు ఇబ్బంది కాలేదని.. అయితే పట్టుదలతో స్లిమ్ గా మారిన బ్రయాన్ ను చూస్తే ఆనందంగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే బ్రయాన్ తనలా అతి బరువుతో బాధపడుతున్న వారికి ఎలా బరువు తగ్గించుకోవాలో సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నాడు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News