కమలంపార్టీ సీనియర్ నేత చేసిన తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి వ్యాఖ్యలు విచిత్రంగా ఉంది. మీడియాతో మాట్లాడుతు తమతో పొత్తుపెట్టుకోవాలని అనుకుంటున్నవారు సీట్లపై చర్చించాలన్నారు. పొత్తుపెట్టుకోవాలని అనుకుంటున్న వారంటే ఎవరు ? ఇప్పటికే జనసేన మిత్రపక్షం కాబట్టి మిగిలింది చంద్రబాబునాయుడు మాత్రమే కదా. చాలాకాలంగా బీజేపీతో పొత్తులకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నది చంద్రబాబు మాత్రమే.
తమతో కలిసిరావాలని అనుకుంటున్నవారు సీట్లపైన చర్చించాలి, తమ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంటే అర్ధమేంటి మిత్రపక్షాలైన జనసేన-బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటువుతుందని చెప్పినట్లుంది. గతంలో ఆ పార్టీకోసం బీజేపీ చాలా త్యాగాలు చేసిందన్నారు. గతంలో ఆ పార్టీ అంటే ఏ పార్టీ. 2014లో టీడీపీ-బీజేపీ పొత్తుపెట్టుకున్నాయి. మరపుడు టీడీపీకోసం బీజేపీ చేసిన త్యాగాలేమిటో విష్ణుచెప్పలేదు.
అప్పుడు బీజేపీ త్యాగం చేసింది కాబట్టి ఇపుడు పొత్తుపెట్టుకోవాలంటే టీడీపీ త్యాగం చేయకతప్పదన్నది విష్ణు పరోక్షంగా చెప్పినట్లయ్యింది. పైగా 'ఆ పార్టీ అధినేత వయసు కూడా పెరిగిపోయింది' అన్నారు. పార్టీ అధినేత వయసు పెరిగిందంటే చంద్రబాబు వయసు 73 ఏళ్ళు.
అంటే చంద్రబాబును ఉద్దేశించే విష్ణు వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. సో, విష్ణు తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత బీజేపీ షరతులకు అంగీకరిస్తే చంద్రబాబుతో పొత్తులకు తమకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పినట్లుగా ప్రచారం మొదలైంది.
హోలు మొత్తంమీద విష్ణు ఎక్కడా టీడీపీ అనికానీ చంద్రబాబు అనికానీ పేరు ప్రస్తావించలేదు. కాకపోతే విష్ణు చేసిన వ్యాఖ్యలంతా టీడీపీ, చంద్రబాబుకే వర్తిస్తాయి. అంటే టీడీపీతో కూడా పొత్తుపెట్టుకోవటానికి బీజేపీ రెడీ అవుతోందనే సంకేతాలను విష్ణు మీడియా సమావేశంలో పంపించారు.
ఎలాగు పొత్తులక రెడీ అవుతున్నపుడు ఇంకా ముసుగులో గుద్దులాటలు ఎందుకో అర్ధం కావటంలేదు. ధైర్యంగా తమతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే ఇవి షరతులు అని బహిరంగంగానే చెప్పవచ్చుకదా. ఎలాగూ పార్టనర్ పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసేందుకు రెడీగా ఉన్నారు. మరిక బీజేపీకి సమస్యేముంది ?