ఎన్టీయార్ కి భారత రత్న...బీజేపీ స్ట్రాటజీయేనా...?

Update: 2023-01-20 01:30 GMT
మహా నటుడు, ప్రజా నాయకుడు ఎన్టీయార్ కి భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారం ఏనాడో రావాల్సిందే. ఎందుకంటే ఎన్టీయార్  దేశంలో విశేషమైన ప్రతిభాశాలి. ఆయన సాధించిన విజయాలు అలా కళ్ళ ముందు ఉన్నాయి. ఆయనకు ఏనాడో భారత రత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ కారణాల వల్లనే అది ఆగింది. ఆ మాటకు వస్తే పద్మశ్రీ అవార్డు కూడా  ఎన్టీయార్ కి మొదట అంత సాఫీగా రాలేదు అంటారు.

ఆ తర్వాత ఆయన పద్మ అవార్డులు ఏవీ రాలేదు. మరి అవార్డులు రాకపోయినంతమాత్రాన   ఎన్టీయార్   ఏమైనా తగ్గిపోయరా అంటే అది ఏమీ లేదు. కానీ అవార్డులు ఎపుడూ స్పూర్తిని ఇస్తాయి. ఆయనకు అంతటి గౌరవం దక్కింది అంటే మిగిలిన వారు ఉత్తేజం అవుతారు. అందుకే ఆయన పోయిన 27 ఏళ్ల తర్వాత అయినా భారత రత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది.

మరి కొద్ది రోజులలో పౌర పురస్కారాల ప్రకటన కేంద్రం చేయనుంది. ప్రతీ ఏడాది రిపబ్లిక్ డేకి ముందు రోజు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఈసారి ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే  ఎన్టీయార్ కి భారత రత్నను ప్రకటించడానికి కేంద్రం ఆలోచిస్తోందని.  ఎన్టీయార్  కి ఈ అవాడు ఇవ్వబోతున్నారు అనండానికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ మధ్యనే ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ  ఎన్టీయార్ ని బాగా పొగిడారు. బీజేపీ సమావేశంలో వేరే పార్టీకి చెందిన నాయకుడిని పొగడాల్సిన అవసరం లేదు. అయితే  ఎన్టీయార్  మరణించినా తెలుగు రాష్ట్రాలలో ఇంకా జనం గుండెలలో ఆయన ఉన్నారు అన్నది అందరికీ తెలిసిందే. అందుకే  ఎన్టీయార్  కి వెన్నుపోటు పొడిచారు అని ఆరోపణలు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రస్తుత నాయకత్వం ఆయన్ని ఎక్కడా విస్మరించడంలేదు, ఆయన జయంతులు,  వర్ధంతుల  వేళ ఘనంగా నివాళి అర్పిస్తొంది.

ఇక బీజేపీ ఈ రకమైన పొలిటికల్ మూవ్ తీసుకోవడం వెనక ఏమైనా రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అంటే రాజకీయ పార్టీ అన్న తరువాత ఎందుకు ఉండవు అన్న మాట వినిపిస్తుంది.  ఎన్టీయార్  కి భారతరత్న ఇవ్వడం ద్వారా ఆయన అభిమానులను ఒక తరం ప్రజలను తమ వైపునకు తిప్పుకోవచ్చు అన్న ఆలోచన అయితే బీజేపీ వర్గాలలో ఉంది అని అంటున్నారు.

ఎన్టీయార్  ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో ఆ సామాజికవర్గాన్ని కూడా తమ వైపునకు తిప్పుకోవచ్చు అని కూడా మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. ఏపీలో చూసుకుంటే తెలుగుదేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది అని అంటున్నారు. మరి తెలుగుదేశం నుంచి వేరుగా జరిగి సొంతంగా ఏదగాలంటే కొంత బేస్ ఉండాలి కదా. అది  ఎన్టీయార్  రూపంలో తెచ్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా  ఎన్టీయార్  అనే రాజకీయ పెట్టుబడిని తమ వైపు కొంత వాటా తీసుకుంటే రేపటి ఎన్నికల్లో ధీటుగా నిలబడతామన్న ఆలోచనలు బీజేపీ పెద్దలకు ఉన్నాయని అంటున్నారు.

ఇంకో ముచ్చట ఏంటి అంటే  ఎన్టీయార్  కి భారతరత్న ఇస్తే అది ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తీసుకోవాల్సి  ఉంటుంది. ఆమె వైసీపీలో ఉన్నారు. ఆ విధంగా వైసీపీకి కూడా ఇది లాభదాయకం అవుతుంది అని అంచనా వేసుకుంటున్నారు. ఏపీలో మళ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా కడుతున్న బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి దూరంగా ఉంటోంది. ఇపుడు భారత రత్న అవార్డుని ఇస్తారు అంటూ వస్తున్న ఊహాగానాల వెనక కూడా పక్కా వ్యూహం ఉంది అంటున్నారు.

నిజానికి  ఎన్టీయార్   కి భారర రత్న ఇవ్వాలన్న నిర్ణయం అపుడెపుడో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడే జరిగిపోయిందని చెబుతారు. నాడు కూడా అడ్డుకున్నది తెలుగుదేశమే అని అంటారు. దానికి కారణం అవార్డు ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుంది అన్న ఆలోచనతోనే అని చెబుతున్నారు. ఇపుడు ఏపీలో పరిస్థితులు మొత్తం మారాయి కాబట్టి ఏమైనా రాజకీయ ప్రయోజనం తమకు కలుగుతుంది అనుకంటే మోడీ సర్కార్  ఎన్టీయార్   కి భారత రత్న ప్రకటించవచ్చు అని అంటున్నారు.

అయితే భారతరత్న ఇచ్చినంతమాత్రామ  ఎన్టీయార్  ని అభిమానించేవారు అంతా బీజేపీ వైపు టర్న్ అవుతారు అనుకుంటే అది పొరపాటే అన్న వారూ ఉన్నారు. ప్రజలను మచ్చిక చేసుకోవడానికి వేరు మార్గాలు ఉన్నాయని అంటున్నారు.  ఎన్టీయార్  కి భారత రత్న ఇస్తే బీజేపీ మీద కాస్తా ప్రేమ అయితే జనాలు చూపిస్తారు. కానీ బీజేపీ గెలవాలి అన్న ఏపీలో ఉనికి చాటాలీ అన్నా ప్రజల కోసం మేలు చేసే పనులు చేస్తేనే అది సాధ్యపడుతుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News